https://oktelugu.com/

Telugu Film Industry: ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపు చూడబోతుందా?

కొందరు హీరోయిన్స్ ఇక్కడ ఛాన్స్ వచ్చాక, వారి టాలెంట్ ను నిరూపించుకొని బాలీవుడ్ కు చెక్కేసేవారు. ఆ తర్వాత టాలీవుడ్ గురించి చీప్ గా కామెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు సీన్ మరింత ఛేంజ్ అవుతుంది. మేకర్స్ ప్లాన్స్, ఆలోచనలు, కథలు డిఫరెంట్ గా ఉండటంతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవల్ లో మన సినిమాలు సూపర్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా చేరుతున్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 13, 2024 / 02:59 PM IST

    Telugu Film Industry

    Follow us on

    Telugu Film Industry: ఒకప్పుడు తెలుగు సినిమాల గురించి పట్టించుకున్న వారు చాలా తక్కువ. బాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ గురించి చీప్ గా మాట్లాడేది అంటారు అప్పటి విశ్లేషకులు. తెలుగు నటీనటులు కూడా బాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు అని ఎన్నో విధాలుగా ఎదురుచూసేవారు. అదే విధంగా చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. నార్త్ స్టార్స్ ఏకంగా టాలీవుడ్ వైపు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమాల్లో కేవలం ఏదో ఒక రోల్ వచ్చినా ఒకే అనుకుంటున్నారు.

    కొందరు హీరోయిన్స్ ఇక్కడ ఛాన్స్ వచ్చాక, వారి టాలెంట్ ను నిరూపించుకొని బాలీవుడ్ కు చెక్కేసేవారు. ఆ తర్వాత టాలీవుడ్ గురించి చీప్ గా కామెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు సీన్ మరింత ఛేంజ్ అవుతుంది. మేకర్స్ ప్లాన్స్, ఆలోచనలు, కథలు డిఫరెంట్ గా ఉండటంతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవల్ లో మన సినిమాలు సూపర్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా చేరుతున్నాయి. మరి ప్రపంచం కూడా మన వైపు చూడబోతుందా అనే క్యూరియాసిటీతో ఉన్నారు కొందరు. దానికి కూడా కారణం లేకపోలేదు.

    జక్కన్న వంటి డైరెక్టర్ల వల్ల టాలీవుడ్ రేంజ్ ఏకంగా బాలీవుడ్ వరకు మాత్రమే కాదు ఏకంగా ప్రపంచం నలుమూలల వరకు పాకింది. ఇప్పుడు ఏకంగా ఈ హైప్‌ను నెక్ట్స్ ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇతర ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపు దృష్టి సారించే విధంగా మరో సినిమాతో ముందుకు రాబోతున్నారు అని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతుంది.

    వీరి సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అదే రేంజ్ లో సినిమా కూడా ఉండబోతుందని సమాచారం. గతంలోనే ఈ సినిమా కథకు సంబంధించిన హింట్ ఇచ్చారు జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్. ఎస్ఎస్ఎంబీ 29 ఆఫ్రికన్‌ ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే యాక్షన్ థ్రిల్లర్‌ అంటూ తెలిపారు. దీంతో సినిమా ఊహకు అందరి రేంజ్ లో ఉండబోతుందని..త్రిల్లర్ జక్కన్న తెరకెక్కిస్తున్నారంటే పక్కా థ్రిల్ ఉంటుందని.. సినిమా రేంజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు జక్కన్న, మహేష్ అభిమానులు.

    అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. అన్నింటికీ మహేష్ బర్త్‌ డే అంటే ఆగస్టు 9న గుడ్ న్యూస్ రాబోతుంది అంటున్నారు. ఒక్కో సినిమాతో తన బౌండరీస్‌ తానే పుష్ చేసుకుంటూ వస్తున్న రాజమౌళి, మహేష్‌ మూవీని గ్లోబల్ లెవల్ లో నిలబెట్టడం మాత్రం పక్కా అంటున్నారు.

    రీసెంట్ గా కల్కి సినిమాతో తెలుగు సినిమాకు గ్లోబల్ రేంజ్‌ ను చూపించారు నాగ్ అశ్విన్. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఏకంగా హాలీవుడ్‌లో మన జెండా ఎగరేసే పనికి పూనుకున్నారు రాజమౌళి. అంటే మహేష్ సినిమా తర్వాత ఏకంగా హాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాలో కనిపించడానికి క్యూ కడతారు అంటున్నారు నెటిజన్లు. కానీ జక్కన్న సినిమాలు అంటే ఆలస్యంగా వస్తాయి. సో ఇది జరగాలంటే చాలా వెయిట్ చేయాల్సిందే.