Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన పాత్ర పుష్ప.. ఈ సినిమాలో ఆయన పుష్ప మ్యానరిజమ్స్ తో పాటు ఆయన క్యారెక్టరైజేశన్ ను మలిచిన విధానం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చింది. అయితే ఈ సినిమాను ఆయన మలిచిన విధానం తెరకెక్కిస్తున్న పాటర్న్ ప్రేక్షకులందరికీ మెస్మరైజ్ చేస్తుంది.
ఇక పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక పుష్ప సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన పుష్ప పుష్ప పుష్ప అనే సాంగ్ తో ఒక్కసారిగా ఈ సినిమా క్రేజ్ తారస్థాయికి వెళ్ళిపోయింది. ఇక గడిచిన నెల రోజుల్లోనే ఈ సినిమా మీద అంచనాలయితే విపరీతంగా పెరిగిపోయాయి. ఇక గూగుల్ లో పుష్ప 2 సినిమా గురించి సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా భారీగా పెరిగిపోయిందని రీసెంట్ గా ఒక సర్వేలో తెలిసింది. ఇక మొత్తానికైతే పుష్ప మానియా పీక్స్ లో ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఆగస్టు 15వ తేదీన పుష్పరాజ్ ని థియేటర్లో చూడడానికి యావత్ ఇండియన్ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ సాధించినట్టయితే అల్లు అర్జున్ క్రేజ్ తారాస్థాయిలో పెరిగిపోతుంది. అలాగే పాన్ ఇండియాలో ఆయనను మించిన నటుడు కూడా మరొకరు లేరు అనేలా తనైతే గుర్తింపు సంపాదించుకుంటాడు. ఇక సుకుమార్ ఇప్పటికే ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.
ఇకపై మాస్ డైరెక్టర్ గా కూడా మరో కొత్త అవతారాన్ని ఎత్తుతాడు. ఇక అందులో కూడా సక్సెస్ ని సాధించి బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. ఇక ఈ సినిమా మీదనే ప్రతి ఒక్కరి చూపు అయితే ఉంది. మరి పుష్పరాజ్ పుష్ప 2 సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ఆగస్టు 15 కోసం ప్రతి ఒక్క అభిమాని ఎదురుచూస్తున్నాడు…