Nagarjuna: అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘ గీతాంజలి ‘ మూవీ గుర్తుండే ఉంటుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక సినిమా ఇది. అప్పట్లో ‘గీతాంజలి’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో వస్తే ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తారు. ఈ ట్రాజెడీ లవ్ స్టోరీ మ్యూజిక్ పరంగా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. ఇందులో హీరోయిన్ గా నటించిన గిరిజ శెట్టర్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.
తొలిసారి గీతాంజలి సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు అది మొదటి సినిమా అయినా .. అనుభవం ఉన్న నటిగా గొప్పగా నటించింది. ఒక అల్లరి పిల్లగా .. ప్రేమ కోసం పరితపించే సగటు అమ్మాయిలా గిరిజ జీవించేసింది. నాగార్జున – గిరిజ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులు ఇప్పటికీ ఫ్రెష్ గా ఫీలవుతుంటారు. లేచి పోదామన్న మొనగాడా… అంటూ గిరిజ నాగార్జునతో చెప్పే డైలాగ్ ఎవర్ గ్రీన్. ‘ గీతాంజలి ‘ సినిమా విడుదలై 25 ఏళ్ళు అయింది. అప్పుడు ఇందు గా ప్రేక్షకులకు చేరువైన గిరిజ .. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఏం చేస్తుందో తెలుసా?
ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం మెడిటేషన్ టీచర్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. లా గ్రేస్ శ్రీ అరబిందో ఇంటిగ్రల్ లైఫ్ సెంటర్ పేరుతో మెడిటేషన్ క్లాసెస్ చెబుతుంది. 1969లో బ్రిటన్ లో జన్మించింది గిరిజ శెట్టర్. 2003లో యోగా, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మనస్తత్వ శాస్త్రంలో డాక్టరల్ థీసెస్ పూర్తి చేసింది. ఆమె తెలుగులో 2002లో హృదయాంజలి సినిమా చేసింది.
ఆ తర్వాత మలయాళంలో రెండు చిత్రాల్లో నటించగా ఒకటి విడుదల కాలేదు. హిందీలో కూడా రెండు చిత్రాలు చేసింది. హీరోయిన్ గా కాకుండా స్పెషల్ పాత్రల్లో నటించింది. 2003 లో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. గిరిజ శెట్టర్ విదేశాల్లో యోగ క్లాసెస్ చెబుతుంది.