Jai Hanuman: మొదటి చిత్రం నుండి ప్రశాంత్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం పరిచయం చేస్తున్నాడు. ఆయన తెరకెక్కించిన అ, కల్కి, జాంబీ రెడ్డి… విలక్షణమైన సబ్జెక్టు తో తెరకెక్కాయి. ఒక్కో చిత్రం ఒక్కో జోనర్. ఇక హనుమాన్ తో ఇండియా వైడ్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. బడా హీరోలతో పోటీపడుతూ 2024 సంక్రాంతి బరిలో నిలిచారు. హనుమాన్ చిత్ర విడుదల ఆపాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే దర్శక నిర్మాతలు తగ్గలేదు.
వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ హనుమాన్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. హనుమాన్ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తేజా సజ్జా వంటి ఒక యంగ్ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అంటే నమ్మలేం. కంటెంట్ ఉంటే స్టార్స్ అవసరం లేదని హనుమాన్ రుజువు చేసింది. హనుమాన్ మూవీకి సీక్వెల్ ఉందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. చెప్పిందే తడవుగా అప్డేట్ కూడా ఇచ్చేశాడు.
ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. అంజనాద్రి 2.0, వెల్కమ్ టు జై హనుమాన్ అని ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే ఆయన షేర్ చేసిన వీడియో గూస్ బంప్స్ లేపేదిగా ఉంది. కొండల మధ్య భారీ నది లేదా సముద్రం కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో ఆంజనేయ స్వామిని శ్లోకం వినిపిస్తుంది. ఈ వీడియో ప్రేక్షకులను ఆకర్షించింది. జై హనుమాన్ చిత్ర పనులు మొదలు పెట్టినట్లు ప్రశాంత్ వర్మ చెప్పకనే చెప్పాడు.
కాగా హనుమాన్ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ లో తేజ సజ్జా హీరో కాదని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఒక స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తారని చెప్పారు. ఆ స్టార్ హీరో రానా అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ వర్మ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. జై హనుమాన్ లో లార్డ్ హనుమాన్ పాత్ర హీరోగా ఉంటుంది. ఈ మూవీ 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్ వర్మ అన్నారు. హనుమాన్ దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. జై హనుమాన్ బడ్జెట్ ఎక్కువగా ఉండే సూచనలు కలవు.