spot_img
Homeఎంటర్టైన్మెంట్LIK Teaser Review: ప్రదీప్ రంగనాథన్ 'LIK' తెలుగు టీజర్ రివ్యూ : కాన్సెప్ట్ కొత్తగా...

LIK Teaser Review: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ తెలుగు టీజర్ రివ్యూ : కాన్సెప్ట్ కొత్తగా ఉంది కానీ, డబ్బింగ్ నీచంగా ఉంది..

LIK Teaser Review: తమిళ యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ‘కోమలి’ అనే చిత్రం డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న ఆయన, ఆ తర్వాత ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి చిత్రాలలో హీరో గా భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని జెన్ జీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఆయనకు ఎంత క్రేజ్ ని తెచ్చిపెట్టాయంటే, ఆయన మూడవ సినిమా ‘డ్యూడ్’ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సూపర్ హిట్ అయ్యేంత రేంజ్ అన్నమాట. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి విడుదల అవ్వబోతున్న సినిమా ‘LIK’ . ఏప్రిల్ 10 న తెలుగు , తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ ని మేకర్స్ కాసేపటి క్రితమే విడుదల చేశారు.

ఈ టీజర్ తమిళ వెర్షన్ లో విడుదలై చాలా రోజులే అయ్యింది. అదే టీజర్ ని ఇప్పుడు తెలుగులోకి దబ్ చేశారు. టీజర్ ని చూస్తుంటే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని అర్థం అవుతోంది. కానీ డబ్బింగ్ మాత్రం నీచం గా ఉంది. సినిమా కాన్సెప్ట్ విషయానికి 2040 వ సంవత్సరం లో జరిగే ఒక లవ్ స్టోరీ అన్నమాట. అప్పటికి మన దేశం లో చోటు చేసుకున్న మార్పులు, అప్పటి యువత ఆలోచన విధానం వంటివి ఈ చిత్రం లో చూపించినట్టు ఈ టీజర్ లో చూస్తే అర్థం అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ కి హీరోయిన్ కృతి శెట్టి ని చూడగానే ప్రేమ పుడుతుంది. అప్పుడు ఆయన తన స్నేహితులతో మాట్లాడుతూ ‘ఉందండీ..ఈరోజుల్లో కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంది. అది ఈ అమ్మాయిని చూడగానే అర్థం అయ్యింది. తల నుండి కాళ్ళ వేళ్ళ వరకు ఒక ఫీలింగ్ వచ్చింది మామా’ అని అంటాడు.

ఈ డైలాగ్ ని బట్టీ చూస్తే 2040 లలో యూత్ ఆలోచన విధానం ఎలా ఉంది ?, ‘తొలిప్రేమ’ కాన్సెప్ట్ అప్పటికీ కూడా ఉందంటే ఎదో వింతగా అనిపిస్తోంది అనే ఫీలింగ్ ని హీరో క్యారక్టర్ ద్వారా డైరెక్టర్ చెప్పించినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఆలోచన విధానం బాగుంది, సరిగ్గా వర్కౌట్ చేసి ఉండుంటే ఈ సినిమా కూడా ప్రదీప్ కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. కానీ హీరో కి డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ , చాలా చెత్తగా అనిపించింది. ప్రదీప్ మొదటి మూడు సినిమాలకు తెలుగు లో డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నింది. ప్రదీప్ వాయిస్ అదేనని తెలుగు ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయం లో ఈ డబ్బింగ్ సినిమాకు పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular