spot_img
Homeబిజినెస్Best cars under 4 lakh in India: రూ.4 లక్షల నుంచి ప్రారంభం.. అత్యధిక...

Best cars under 4 lakh in India: రూ.4 లక్షల నుంచి ప్రారంభం.. అత్యధిక మైలేజ్.. బెస్ట్ కార్లు ఇవే..

Best cars under 4 lakh in India: చిన్న చిన్న అవసరాలతో పాటు చిన్న ఫ్యామిలీ ప్రయాణాలు చేయడానికి ప్రస్తుతం సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. కార్యాలయ అవసరాలకు సైతం కారులోని వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్తగా కారు కొనేవారు ముందుగా బడ్జెట్లో తీసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు అతి తక్కువ ధరలోనే అందమైన కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. వీటిలో కొన్ని రూ.6 లక్షల లోపే విక్రయిస్తున్నారు. వీటిలో ఫ్యామిలీకి అనుగుణంగా ఉండడంతో పాటు లగ్జరీ లుక్ తో కూడా ఉన్నాయి. వారి అవసరాలను బట్టి ఈ కార్లను తీసుకోవచ్చు అని ఆటోమోబైల్ నిపుణులు అంటున్నారు. ఇంతకీ బడ్జెట్ లోనే ఉండే బెస్ట్ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

దేశంలో అత్యధిక కార్ల విక్రయించే కంపెనీ మారుతి సుజుకి గా ప్రతి ఏటా నిలుస్తూ ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు ఈ కంపెనీ నుంచి రోడ్లపైకి వచ్చాయి. అయితే బడ్జెట్ కార్ కూడా ఈ కంపెనీ విక్రయిస్తుంది. అలాంటి కార్లలో ఆల్టో గురించి చెప్పవచ్చు. మారుతి సుజుకి కంపెనీలో ఉన్న కార్లలో అతి తక్కువ బడ్జెట్ కలిగిన కారు ఇదే. దీనిని 3.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 1.0 పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు లీటర్ ఇందడానికి 24.39 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. రెనాల్ట్ కంపెనీకి చెందిన మరో కారు క్విడ్. స్టైలిష్ గా ఉండడంతో పాటు లగ్జరీ లుక్ తో కారు కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటారు. దీనిని రూ.4.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 8 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు రివర్స్ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి కంపెనీకి చెందిన S Presso కారు బడ్జెట్లో కొనుగోలు చేయవచ్చు. దీనిని రూ.4.26 లక్షల ప్రారంభ ఘనత విప్లయిస్తున్నారు. ఎస్ యు వి వలె విశాలమైన క్యాబిన్ ఉన్న కారు కావాలంటే దీనిని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ఇందులో డిజిటల్ స్క్రీన్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లో ఉన్నాయి. మారుతి సుజుకి తర్వాత అత్యధిక కార్ల విక్రయాలు జరుపుకుంటున్న కంపెనీ టాటా. ఈ కంపెనీకి చెందిన టియాగో కారు చిన్న ఫ్యామిలీకి అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కారు లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన టీచర్లు ఉన్నాయి. అలాగే మారుతి కంపెనీకి చెందిన సెలెరియో కారు ధర రూ రూ. 5.37 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది లీటర్ ఇంందడానికి 26.68 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular