https://oktelugu.com/

Salaar 2: సలార్ 2లో ప్రభాస్ కు విలన్ గా ఎవరూ ఊహించని వ్యక్తి…

పృథ్వి రాజ్ సుకుమారన్ చెప్పినట్టుగా నీల్ యూనివర్స్ లో భాగంగా శక్తి మన్నారు క్యారెక్టర్ కి మరొక సినిమాతో కనెక్షన్ ఉండబోతుంది అంటూ తను రీసెంట్ గా చెప్పిన మాటలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : May 17, 2024 / 08:03 AM IST

    Salaar 2

    Follow us on

    Salaar 2: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో ఆయనకి మంచి విజయాలను తీసుకువచ్చి పెట్టాయి. ఇక గత సంవత్సరం ఎండింగ్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా భారీ సక్సెస్ ను సాధించింది. ఇక ఈ సినిమా దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు సలార్ 2 కు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. ఇంకా ఇప్పటికే సలార్ సినిమాలో ప్రభాస్ చాలా మాస్ లుక్ లో కనిపించాడు.

    ఇక అసలైన స్టోరీ సలార్ 2 లోనే ప్రారంభం కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సలార్ మొదటి పార్ట్ ను ‘సీజ్ ఫైర్’ గా తెరకెక్కించగా సలార్ 2 ను ‘శౌర్యంగా పర్వం’ గా తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ రేంజ్ లో సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సలార్ 2 సినిమాలో మలయాళ నటుడు అయిన ‘షైన్ టామ్ చాకో’ సరికొత్త విలన్ గా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక పృథ్వి రాజ్ సుకుమారన్ చెప్పినట్టుగా నీల్ యూనివర్స్ లో భాగంగా శక్తి మన్నారు క్యారెక్టర్ కి మరొక సినిమాతో కనెక్షన్ ఉండబోతుంది అంటూ తను రీసెంట్ గా చెప్పిన మాటలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సలార్ సినిమాకి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి కనెక్షన్ పెడతాడా లేదంటే కేజీఎఫ్ 3 కి లింకు పెడతాడా అనే ఆసక్తికరమైన చర్చలైతే జరుగుతున్నాయి…

    ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ యూనివర్స్ ను తెరకెక్కించబోతున్నాడు అనే విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ 2 కి సంబంధించిన సెట్ లను వేయిస్తున్నాడు. అంటే తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…