Double ISmart: డబుల్ ఇస్మార్ట్ పూరి కి డూ ఆర్ డై మూవీనా..?

పూరి జగన్నాథ్ కి అది కోలుకోలేని దెబ్బ తగిలినట్టే అని ట్రేడ్ పండితులు సైతం ఆయన విషయంలో చాలా వరకు అతన్ని హెచ్చరిస్తున్నారు.నిజానికి ఇప్పుడు ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.

Written By: Gopi, Updated On : May 17, 2024 8:11 am

Double ISmart

Follow us on

Double ISmart: ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్… అప్పట్లో వరుసగా సక్సెస్ లను సాధించడమే కాకుండా ప్రతి ఒక్క హీరోకి కూడా తనదైన రీతిలో సూపర్ సక్సెస్ లను అందించి స్టార్ హీరోలుగా మార్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన తన ఫామ్ ను కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ఇక 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత వచ్చిన లైగర్ సినిమాతో చాలావరకు దెబ్బతిన్నాడు.

ఇక ఇప్పుడు రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ అందుకుంటే మరోసారి ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తాయి. కానీ ఈ సినిమా కనక దెబ్బ పడితే మాత్రం పూరి జగన్నాథ్ కి అది కోలుకోలేని దెబ్బ తగిలినట్టే అని ట్రేడ్ పండితులు సైతం ఆయన విషయంలో చాలా వరకు అతన్ని హెచ్చరిస్తున్నారు.నిజానికి ఇప్పుడు ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.

ఇక ఈ అవకాశం చేజర్చుకుంటే మాత్రం ఇక ఆయనకు అవకాశం ఇచ్చే హీరోలు కూడా దొరకరు అనేది మాత్రం వాస్తవం… ఎందుకంటే ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్ లో చాలామంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. మన స్టార్ హీరోలు వాళ్ళకే డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఇక ఫెయిల్యూర్ డైరెక్టర్ ని పట్టించుకునే తీరిక కూడా వాళ్లకు ఉండదు. కాబట్టి మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది…

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అయితే చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఇక ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి వే లో అయితే వచ్చిందో ఈ సినిమా కూడా అలాంటి వే లోనే అలాంటి టెంపో తోనే ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…చూడాలి మరి ఈ మూవీ తో పూరి సక్సెస్ కొడుతడా లేదా అనేది…