Hollywood Adventure Movie : హాలీవుడ్ కి చెందిన అత్యంత అడ్వెంచరేస్ సినిమా ఏంటో తెలుసా..?

ఇక వావ్ అనే మూమెంట్స్ కూడా చాలానే ఉంటాయి...ఇక ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. వీలైతే ఒకసారి చూసేయండి...

Written By: Gopi, Updated On : May 16, 2024 9:58 pm

Alpha is the most adventure movie of Hollywood

Follow us on

Hollywood adventure movie : ఇండియన్ సినిమాలతో పోల్చుకుంటే హాలీవుడ్ సినిమాల స్టాండర్డ్ అనేది భారీ లెవెల్ లో ఉంటుంది. అందుకే అక్కడ వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా విజువల్స్ పరంగా కూడా చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తారు. ఇక ప్రపంచంలోనే అత్యద్భుతమైన కెమెరా ఫ్రేమ్స్ కూడా మనకు వాళ్ల సినిమాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే మనలో చాలా మంది అడ్వెంచర్ జానర్ లో సినిమాలని చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు.

ఇక ఇలాంటి వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ‘ఆల్ఫా ‘ 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ‘ఆల్బర్ట్ హ్యూస్’ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకులు విజువల్ గా వేరే ప్రపంచం లోకి వెళ్ళిపోతారు. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే ఒక ప్రాంతానికి చెందిన కొంతమంది ట్రైబ్స్ అడవి దున్నలను తీసుకొని వేటకి వెళ్తారు. ఇక ఈ క్రమంలో ఆ అడవిదున్నలు తిరగబడి వాళ్లని తొక్కేస్తు ఉంటాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆ ట్రైబ్స్ కి చెందిన లీడర్ యొక్క కొడుకు అక్కడి నుంచి ఒక లోయలో పడతాడు. ఇక అక్కడ పడిపోయిన ఆయనకి ఒక తోడేలు అయితే కనిపిస్తుంది. ఆ తోడేలుతో ఇతడు స్నేహం చేసి దాంతోపాటు ఇద్దరూ కలిసి జీవిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ వ్యక్తి మళ్లీ ట్రైబ్స్ దగ్గరికి ఎలా చేరుకున్నాడు అనేదే సినిమా స్టోరీ.. అయితే ఈ సినిమాలో విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉంటాయనే చెప్పాలి.

ఇక మేకింగ్ పరంగా దర్శకుడు ప్రతి సీన్ ని ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఇక ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాటిని ఎంజాయ్ చేస్తాడు. ఇక వావ్ అనే మూమెంట్స్ కూడా చాలానే ఉంటాయి…ఇక ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. వీలైతే ఒకసారి చూసేయండి…