https://oktelugu.com/

Shyamaladevi: ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ఆగ్రహం వచ్చింది… ఇక వేణు స్వామి పని అవుట్, వైరల్ గా ఆమె లేటెస్ట్ కామెంట్స్!

కల్కి సక్సెస్ ని ప్రభాస్ తో పాటు కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆనందానికి హద్దులు లేవు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామలాదేవి తన కొడుకు ప్రభాస్ ని విమర్శించిన వాళ్లకు చురకలు వేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 8, 2024 / 10:30 AM IST

    Shyamaladevi

    Follow us on

    Shyamaladevi: కల్కి 2829 AD బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి కలెక్షన్స్ వెయ్యి కోట్లకు దగ్గరవుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. రెండో వారం కూడా స్ట్రాంగ్ గా రన్ అయ్యింది. ఇప్పటికే పలు రికార్డ్స్ బద్దలు కొట్టింది కల్కి. యూఎస్ లో కల్కి $15 మిలియన్స్ మార్క్ దాటేసింది. ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసింది. యూఎస్ లో నాలుగు వంద కోట్ల చిత్రాలను ప్రభాస్ కలిగి ఉన్నాడు. టాలీవుడ్ లో మరే ఇతర హీరోకి ఈ రికార్డ్ లేదు.

    కల్కి సక్సెస్ ని ప్రభాస్ తో పాటు కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆనందానికి హద్దులు లేవు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామలాదేవి తన కొడుకు ప్రభాస్ ని విమర్శించిన వాళ్లకు చురకలు వేసింది. ఆమె వేణు స్వామికి కౌంటర్ ఇచ్చింది. శ్యామలాదేవి మాట్లాడుతూ… ప్రభాస్ పెళ్లి, కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు జ్యోతిష్యులు చెప్పారు. బాహుబలి తర్వాత విజయం దక్కదన్నారు. కానీ వారి అంచనాలు తారుమారు అయ్యాయి.

    కల్కి బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రభాస్ పెళ్లి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రభాస్ కి వివాహం చేయాలని మాకు కూడా ఉంది. పైనుంచి కృష్ణంరాజు అన్నీ చూస్తున్నారని ఆమె అన్నారు. శ్యామలాదేవి ఇక్కడ ఉద్దేశించిన జ్యోతిష్యుడు వేణు స్వామి అనడంలో సందేహం లేదు. గతంలో వేణు స్వామి హీరో ప్రభాస్ మీద పలుమార్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. సలార్ ప్లాప్ అవుతుందని అన్నారు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ అభిమానులను బాధించాడు.

    సలార్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో వేణు స్వామి జాతకం ఫెయిల్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. నేను జాతకం ప్రకారమే చెబుతాను. నాకు వ్యక్తిగతంగా ఎవరిపై ద్వేషం ఉండదు. కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుని అభిమానులు ట్రోల్ చేస్తారని వేణు స్వామీ తనని తాను సమర్ధించుకున్నారు. వేణు స్వామి మీద శ్యామలాదేవికి కోపం వచ్చిన నేపథ్యంలో అతని పని అవుట్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ముందు నీ జాతకం చూసుకో అని వేణు స్వామిని ఎద్దేవా చేస్తున్నారు.