https://oktelugu.com/

Anchor Suma and Siddharth: యాంకర్ సుమతో అంత రోమాంటిక్ గా.. హీరో సిద్ధార్థ్ చేసిన పనికి అంతా షాక్…

Anchor Suma and Siddharth: సిద్ధార్థ్ సుమ ను ఉద్దేశించి కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఇంతకు ముందు చాలా మంది మేమిద్దరం స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చాలా ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేశారని, ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తామని సిద్దు సుమ భుజాల మీద చేయి వేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 10:29 AM IST

    Anchor Suma and Siddharth hugs on Indian 2 pre-release event

    Follow us on

    Anchor Suma and Siddharth: భారతీయుడు 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కి రెఢీ అవుతున్న క్రమంలో ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యం తో రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కండక్ట్ చేశారు. అయితే తమిళంలో చాలా రోజుల క్రితమే ఈ ఈవెంట్ చేశారు. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే సినిమా మీద బజ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు ఈ ఈవెంట్ చేశారు.

    ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో సిద్ధార్థ్ సుమ ను ఉద్దేశించి కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఇంతకు ముందు చాలా మంది మేమిద్దరం స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చాలా ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేశారని, ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తామని సిద్దు సుమ భుజాల మీద చేయి వేశాడు. అలాగే సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

    ఇక దాంతో సుమ కూడా “ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి ఏజ్ అనేది ఎవరు పసిగట్టలేరు. ఎవరి ఏజ్ ఎంత పెరుగుకుంటూ పోయిన కూడా మన ఏజ్ మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి… ఇక ఇదిలా ఉంటే సిద్ధార్థ్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.

    ఇక ఈ సక్సెస్ తో మరోసారి ఆయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగబోతున్నాడు అంటు మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి భారతీయుడు 2 సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…