Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Kalki 2898 AD: ఐపీఎల్ లో ప్రత్యక్షమైన కల్కి... ప్రభాస్ లుక్ చూసి అందరూ షేక్,...

Kalki 2898 AD: ఐపీఎల్ లో ప్రత్యక్షమైన కల్కి… ప్రభాస్ లుక్ చూసి అందరూ షేక్, వైరల్ వీడియో

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD . ఈ చిత్ర ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రభాస్ కల్కి గెటప్ లో ఐపీఎల్ లో ప్రత్యక్షం కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ. హీరో కథలో భాగంగా కాలంలో ప్రయాణిస్తాడనే వాదన ఉంది. ముఖ్యంగా భవిష్యత్ లో ప్రపంచం ఎలా ఉంటుందో నాగ్ అశ్విన్ గొప్పగా తెరకెక్కించారట.

ఫ్యూచర్ వరల్డ్ మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తామని నాగ్ అశ్విన్ ధీమాగా చెబుతున్నాడు. కల్కి విజయం పై ఆయన విశ్వాసంతో ఉన్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 27 కి వాయిదా పడింది. విడుదల తేదీ దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. మెగా ఈవెంట్ ఐపీఎల్ వేదికగా కల్కి చిత్రాన్ని ప్రమోట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని సమాచారం. సదరు భైరవ గెటప్ లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. మే 3న ముంబై-కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ని ప్రమోట్ చేస్తూ ప్రభాస్ కనిపించారు. కల్కి చిత్రం నుండి ప్రభాస్ లుక్ మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కల్కి మూవీకి భారీ ప్రచారం కల్పించడం కోసం నిర్మాతలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

ఇక కల్కి మూవీలో స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనె కీలక పాత్రలో కనిపించనుంది. దీపికా లుక్ లో కూడా డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఇక అమితాబ్ చేస్తున్న పాత్ర అశ్వద్ధామ అని ఇటీవల రివీల్ చేశారు. మావో లెజెండ్ కమల్ హాసన్ సైతం నటిస్తున్నాడు. ఆయన పాత్రపై ఇంకా క్లారిటీ లేదు. దిశా పటాని మరొక హీరోయిన్ గా చేస్తుంది. అశ్వనీ దత్ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular