AP Elections 2024 Result : కూటమి గెలుస్తుందని వైసీపీ నేతల బెట్టింగులు

అయితే ఇదంతా కూటమి నేతల దుష్ప్రచారం అని వైసిపి నేతలు కొట్టి పారేస్తున్నారు. మైండ్ గేమ్ ఆడుతున్నట్లు భావిస్తున్నారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో తమదే విజయమని కొందరు వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Written By: NARESH, Updated On : May 23, 2024 8:51 am

YCP leaders are betting that the TDP alliance will win

Follow us on

AP Elections 2024 Result : కూటమి గెలవాలని వైసిపి అభ్యర్థులు కోరుకుంటున్నారా? బలంగా ఆకాంక్షిస్తున్నారా?అప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఏపీ అసెంబ్లీకి పోలింగ్ ముగిసింది. పది రోజులు దాటుతోంది. మరో పది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. తప్పకుండా అధికారంలోకి వస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కూటమి నేతలు సైతం గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అధికార పార్టీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ సరళి బట్టి అర్థమవుతోంది. దీంతో వైసిపి అభ్యర్థులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఓటమి తప్పదని భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో జగన్ వేవ్ తో మరోసారి గెలుపొందుతామని వైసిపి అభ్యర్థులు అంచనా వేశారు. ప్రత్యర్ధులు ఖర్చుకు దిగడంతో.. అంతకుమించి అన్నట్టు ఖర్చు పెట్టేశారు. కానీ ఫలితాల సరళి తమకు అనుకూలం కాదని భావిస్తున్నారు.అదే జరిగితే తమకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని అంచనాకు వచ్చారు. ఇప్పటికే కూటమి గెలుస్తుందని భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగి.. రెట్టింపు సొమ్ము అందిస్తామని.. వైసిపి గెలుస్తుందనుకుంటే నాలుగు రెట్లు ఇస్తామని బెట్టింగ్ కు దిగుతున్నారు. అయితే ఇప్పటికే పోలింగ్ సరులతో ఫలితాలు పై క్లారిటీ కి వచ్చారు వైసిపి అభ్యర్థులు. అందుకే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన కొంత మొత్తాన్ని అయినా వెనక్కి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే కూటమి గెలుస్తుందని బెట్టింగులకు దిగినట్లు తెలుస్తోంది.

వైసీపీ అభ్యర్థుల్లో చాలామంది తీవ్ర ఆందోళనతో ఉన్నారు.ఈ పరిస్థితి వస్తుందని తెలిస్తే ముందుగానే తాము పోటీ నుంచి తప్పుకునే వారమని సన్నిహితులు వద్ద చెబుతున్నారు.సీఎం జగన్ పై అతి విశ్వాసంతో ఉండిపోయామని.. అదే తమ కొంప ముంచిందని అంచనాకు వస్తున్నారు. అందుకే కూటమి గెలుపు పై భారీగా బెట్టింగులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.ఓ వైసిపి అభ్యర్థి అయితే 50 కోట్ల రూపాయల వరకు బెట్టింగుకు దిగినట్లు తెలుస్తోంది. ఎలాగూ ఎన్నికల్లో ఓడిపోతాం కదా.. కనీసం బెట్టింగ్ లోనైనా కొంత మొత్తం వెనకేసుకోవచ్చని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే వైసిపి అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది కానీ.. ఆయన పేరు మాత్రం బయటపడడం లేదు. అయితే ఇదంతా కూటమి నేతల దుష్ప్రచారం అని వైసిపి నేతలు కొట్టి పారేస్తున్నారు. మైండ్ గేమ్ ఆడుతున్నట్లు భావిస్తున్నారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో తమదే విజయమని కొందరు వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.