https://oktelugu.com/

Game Changer : గేమ్ చేంజర్ సినిమా విషయంలో భయపడిపోతున్న శంకర్ కారణం ఏంటంటే..?

ఇక మొత్తానికైతే శంకర్ ఇలాంటి సమయంలోనే ఇటు ఇండియన్ 2, అటు గేమ్ చేంజర్ లాంటి రెండు సినిమాలు రిలీజ్ చేసి తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : May 22, 2024 / 09:46 PM IST

    Shankar is worried about Ramcharan's 'Game Changer' movie

    Follow us on

    Game Changer : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ శంకర్…ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇండియన్ 2 అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అవుతుందని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను మిగులుస్తుంది అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.

    కాబట్టి ఇలాంటి క్రమంలోనే శంకర్ ‘గేమ్ చేంజర్’ సినిమా విషయంలో కొంతవరకు భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ‘భారతీయుడు 2’ సినిమా కనక తేడా కొడితే ‘గేమ్ చేంజర్’ సినిమా పైన భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరోకి రామ్ చరణ్ కి సూపర్ హిట్ ఇస్తానని శంకర్ మాట ఇచ్చి మరీ రామ్ చరణ్ ను దాదాపు మూడు సంవత్సరాల నుంచి తన వెంట తిప్పుకుంటున్నాడు.

    అయినప్పటికీ ఇంకా కూడా షూటింగ్ అయితే పూర్తి అవ్వకపోవడంతో శంకర్ ఈ సినిమా విషయంలో ఏం చేస్తున్నాడు అంటూ రామ్ చరణ్ అభిమానులు విపరీతమైన ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా కనక తేడా కొడితే రామ్ చరణ్ అభిమానుల చేతుల్లో శంకర్ కి అవమానం తప్పేట్టుగా లేదు. ఇలా కనక జరిగితే శంకర్ తీయబోయే నెక్స్ట్ సినిమాకి స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చే ఛాన్సులు కూడా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు…

    అందుకే శంకర్ గేమ్ చేంజర్ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమా మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే శంకర్ ఇలాంటి సమయంలోనే ఇటు ఇండియన్ 2, అటు గేమ్ చేంజర్ లాంటి రెండు సినిమాలు రిలీజ్ చేసి తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు…