Vijay Deverakonda: విజయ్ ను తిడుతున్న ప్రభాస్ అభిమానులు? ఎందుకంటే

అమితాబ్‌ను గొప్ప హీరోగా చూపించారని.. లార్జన్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కమల్ సైతం.. తన రోల్‌ను చించేశాడని.. ఆయన తప్పితే మరొకరు చేయలేనట్టుగా నటించారని తెలుపుతున్నారు.

Written By: Swathi, Updated On : June 28, 2024 2:21 pm

Vijay Deverakonda

Follow us on

Vijay Deverakonda: ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల సినీ ప్రియులు కల్కీ అంటూ జపం చేస్తున్నారు. ఈ సినిమాను మన దేశంలో మాత్రమే కాదు విదేశీయులు వీక్షిస్తున్నారు. కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. చూసేది తెలుగు సినిమానా? హాలీవుడ్ సినిమానా అనే రేంజ్ లో ఉంది సినిమా అంటూ కామెంట్లు వస్తున్నాయి. ప్రీ ఇంటర్వెల్ సినిమా ఒక హై ఇచ్చిందని… చివరి 20 నిమిషాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు.. నాగ్ అశ్విన్ ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిపోయాడని కొనియాడుతున్నారు ప్రభాస్ అభిమానులు.

ఇందులో అమితాబ్‌ను గొప్ప హీరోగా చూపించారని.. లార్జన్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కమల్ సైతం.. తన రోల్‌ను చించేశాడని.. ఆయన తప్పితే మరొకరు చేయలేనట్టుగా నటించారని తెలుపుతున్నారు. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని.. అసలు ప్రభాస్ లేకపోతే కల్కీ లేదని కూడ కామెంట్లు వస్తున్నాయి. సినిమా గురించి మొత్తం పాజిటీవ్‌గా సాగుతుందని కానీ.. ఒక్క విషయం మాత్రం బాగా డిసప్పాయింట్ చేస్తుందట.

ఈ మొత్తం సినిమాకు విజయ్ దేవరకొండనే మైనస్ అంటున్నారు. అర్జునుడు లాంటి క్యారెక్టర్‌ను కూడా అదే తెలంగాణ యాసలో మాట్లాడటం ఏంటి? కనీసం మీసాలైన తీయాలి కదా అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం విజయ్‌ను ఎందుకంత హేట్ చేస్తున్నారు. ఆయనిచ్చిన క్యారెక్టర్ ఆయన చేశారు. కావాలని ఏం చేయలేదు కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి నాగ్ అశ్విన్‌కు విజయ్ సెంటిమెంట్, అంతేకాకుండా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుంచి మంచి ఫ్రెండ్స్ అందుకే నాగ్ అశ్విన్ అడిగారని ఆ రోల్ చేశారట.

రౌడీ బాయ్ మీద వచ్చిన ఈ నెగిటివిటీ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ముందు నుంచి విజయ్‌ను ఒక సర్టెన్ ఆడియెన్స్ హేట్ చేస్తున్నారు. కానీఈయన చేసే నటనలో పెద్దగా నెగిటివ్ ఏం ఉండదు. ఒక సినిమా ఉందని అన్ని సినిమాలను హేట్ చేయడం, హీరోను హేట్ చేయడం ఎందుకని కూడ అంటున్నారు విజయ్ అభిమానులు. బాలీవుడ్‌లో సైతం విజయ్‌కు పిచ్చ క్రేజ్ ఉంది. మనవాళ్లు ఓర్వలేకపోతున్నారు కానీ.. నార్త్‌లో విజయ్ స్క్రీన్‌పై కనిపించగానే ఈలలు, గోలలతో థియేటర్‌లు ఓ ఊపు ఊగుతుంటాయి అనే కామెంట్లు కూడా వస్తున్నాయి.