https://oktelugu.com/

Jio: కొడుకు పెళ్లి ఖర్చు జియో వినియోగదారులపైనేనా? నెటిజన్ల ట్రోల్స్

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, పాప్ సెన్సేషన్ రిహాన్నాతో సహా బాలీవుడ్ నుంచి సీనియర్, ఇప్పుడున్న స్టార్లు పాల్గొన్నారు. ఇక రెండో ప్రీ వెడ్డింగ్ కూడా భారీగానే నిర్వహించారు. దీని కోసం ఒక క్రూయిజ్ బుక్ చేశారు. ఇక్కడికి కూడా వరల్డ్ వైడ్ సెలబ్రెటీలు వచ్చారు. ఇది కూడా బాగానే జరిగింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 28, 2024 / 01:58 PM IST

    Jio

    Follow us on

    Jio: అంబాని ఇంట మరి కొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ముఖేష్ అంబాని చిన్న కొడుకు అనంత్ అబానీ-రాధికా మర్చంట్ ను వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు నిర్వహించారు. మొదటిది అంబానీ జన్మస్థలం గుజరాత్ లోని జామ్ నగర్ లో జరగగా.. ప్రపంచంలోని ప్రముఖులు పాల్గొన్నారు.

    మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, పాప్ సెన్సేషన్ రిహాన్నాతో సహా బాలీవుడ్ నుంచి సీనియర్, ఇప్పుడున్న స్టార్లు పాల్గొన్నారు. ఇక రెండో ప్రీ వెడ్డింగ్ కూడా భారీగానే నిర్వహించారు. దీని కోసం ఒక క్రూయిజ్ బుక్ చేశారు. ఇక్కడికి కూడా వరల్డ్ వైడ్ సెలబ్రెటీలు వచ్చారు. ఇది కూడా బాగానే జరిగింది.

    ఇంత భారీగా ప్రీ వెడ్డింగ్ నిర్వహించిన అనంత్ అంబానీ వివాహ వేడుకలు జూన్ 29 (శనివారం) నుంచి ప్రారంభం అవుతాయట. జూలై 12 (శుక్రవారం) ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో వివాహం జరగనుందట. అయితే ఈ పెళ్లిని ముఖేష్ అంబానీ భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎంతంటే కేవలం వివాహానికే రూ. 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట.

    ఈ నేపథ్యంలో ఇటీవల జియో టారీఫ్ చార్జిలను పెంచారు ముఖేష్ అంబానీ. 2019 తర్వాత ఇప్పుడు పెంచడంతో ప్రస్తుతం విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ‘కొడుకు వివాహ ఖర్చును తమపైనే ఎల్లదీస్తున్నావా అంబానీ మామా’, అంటూ కొందరు ‘కొడుకు పెళ్లి పెట్టుకున్నాడు రేట్లు పెంచాడు’ అంటూ మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.