Naga Chaitanya: మళ్లీ శోభిత తో కలిసి ఫోటోలు.. చైతు ప్రేమకు ఇదే నిదర్శనం

యూరప్ లోని ఓ బార్ లో వైన్ టెస్టింగ్ సెషన్ లో చైతూ, శోభిత పాల్గొన్నట్లుగా ఓ ఫోటోలో కనిపిస్తున్నారు. అందులో చైతూ తండేల్ సినిమా కోసం ఉన్న లుక్ లోనే కనిపిస్తున్నారు.

Written By: Swathi, Updated On : June 5, 2024 8:53 am

Naga Chaitanya

Follow us on

Naga Chaitanya: అక్కినేని హీరో.. యువసామ్రాట్ నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్య ఈయన పేరు ఎక్కువగానే వైరల్ అవుతుంది. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చైతూ.. పర్సనల్ విషయాలు నెట్టింట తెగ వైరల్ గా అవుతుంటాయి. కొన్ని రోజుల నుంచి చైతూ శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి వెకేషన్ వెళ్లిన ఫోటోస్ కూడా రావడంతో ఈ టాక్ మరింత పెరిగింది. చాలాసార్లు వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా మౌనం వహించారు.

ఎవరు పెదవి విప్పకపోవడంతో ఈ వార్తలు నిజమే అనుకుంటున్నారు నెటిజన్లు. అంతేకాదు.. వీరిద్దరు తమ ఇన్ స్టా ఖాతాలలో షేర్ చేసే ఫోటోస్ బ్యాగ్రౌండ్స్ ఒకే విధంగా ఉండటంతో ఇద్దరు కలిసి వెకేషన్ వెళ్లారని సులభంగానే కనుగొనవచ్చు. ఇప్పుడు మరోసారి ఇద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అదేంటి అనుకుంటున్నారా?

యూరప్ లోని ఓ బార్ లో వైన్ టెస్టింగ్ సెషన్ లో చైతూ, శోభిత పాల్గొన్నట్లుగా ఓ ఫోటోలో కనిపిస్తున్నారు. అందులో చైతూ తండేల్ సినిమా కోసం ఉన్న లుక్ లోనే కనిపిస్తున్నారు. చైతూ, శోభితా చాలా రోజులుగా కలిసే వెకేషన్ వెళ్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. చైతూ అభిమానులు మాత్రం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద వీరి రిలేషన్ గురించి విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం నాగ చైతన్య డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వంలో రాబోతున్న తండేల్ సినిమాలో సినిమాతో బిజీగా ఉంటే.. ఇందులో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. అలాగే శోభితా విషయానికి వస్తే తెలుగు, హిందీతోపాటు హాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకొని దూసుకొని పోతుంది. ప్రస్తుతం సితార అనే సినిమాలో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.