Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఆయనకి నచ్చిన 3 సినిమాలు ఇవే…

పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. నిజానికి ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒకటి రెండు సినిమాలను మినహయిస్తే మిగతా ఏ సినిమా సక్సెస్ ఫంక్షన్లకు తను వెళ్లలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By: Gopi, Updated On : July 3, 2024 9:48 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇప్పుడు అంటే సినిమా టికెట్లని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు గానీ, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం క్యూ లైన్ లో నిల్చొని కొట్టుకొని చొక్కాలు చించుకొని మరి టికెట్ దక్కించుకొని వెళ్లి సినిమాలు చూసేవారు.పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆనందంతో అరుపులు, హుషారుగా కేకలు వేసిన రోజులు కూడా ఉన్నాయి.

అలాంటి పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. నిజానికి ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒకటి రెండు సినిమాలను మినహయిస్తే మిగతా ఏ సినిమా సక్సెస్ ఫంక్షన్లకు తను వెళ్లలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనకు సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేదు తన పని తను చేసుకుంటూ వెళ్లడం ఒకటే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తానని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు…ఇక పవన్ కళ్యాణ్ తన ఎంటైర్ కెరియర్ లో తీసిన సినిమాల్లో ఒక మూడు సినిమాలు అంటే ఆయనకు విపరీతంగా ఇష్టమట.

అందులో తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి సినిమాలంటే ఆయనకు ఇప్పటికీ చాలా ఇష్టమట. ఇక ఆయన డైరెక్షన్ చేసిన జానీ సినిమా కూడా ఇష్టమే కానీ అది తను డైరెక్ట్ చేయడం వల్ల తనకు నచ్చిందని పక్క వాళ్ళ డైరెక్షన్ లో తను చేసిన సినిమాల్లో మాత్రం ఈ మూడు సినిమాలు అంటే విపరీతమైన ఇష్టమని తను చాలా సందర్భల్లో తెలియజేశాడు.

ఇక ఈ మూడింటిలో కూడా ఆయన ఎక్కువగా తమ్ముడు సినిమా కోసం కష్టపడ్డాడట. ఇక ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన సీన్స్ ఉంటాయి కాబట్టి దానికోసం విపరీతంగా కష్టపడ్డాడట. డూప్ లేకుండా స్టంట్స్ అన్ని రియల్ గానే చేశాడు. అలా పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో సినిమాలా కోసం విపరీతంగా కష్టపడ్డాడు…అందుకే ఆయన పవర్ స్టారర్ అయ్యాడు…