Balakrishna Marriage: ఆ ఒక్క కారణం వల్లే బాలకృష్ణ పెళ్లికి రాలేకపోయిన ఎన్టీయార్, హరికృష్ణ…

బాలకృష్ణ తన సోదరుడు అయిన రామకృష్ణ ఇద్దరు కూడా ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్లిద్దరి పెళ్లి 1982 డిసెంబర్ 8 వ తేదీన అయింది. ఇక అప్పుడే కొత్తగా టిడిపి పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరూ ప్రచార యాత్రలో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల ఎన్టీయార్, హరికృష్ణ ఇద్దరు బాలకృష్ణ పెళ్లికి రాలేకపోయారు.

Written By: Gopi, Updated On : July 18, 2024 1:07 pm

Balakrishna Marriage

Follow us on

Balakrishna Marriage: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేర్లలో ‘స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు’ గారి పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు ఎవరు మర్చిపోలేరు. ఒకరకంగా ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉంది అంటే దానికి కారణం ఆయననే చెప్పాలి. హీరోగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే తెలుగు సినిమా ఇండస్ట్రీని దేశం నలుమూలాల వ్యాపింపజేశారు. అలాగే తెలుగు నటులకు ఇండియన్ ఇండస్ట్రీ లో గుర్తింపు వచ్చేలా చేశాడు. ఇక అలాగే ఆయన ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఇండస్ట్రీకి సేవలు అందిస్తూనే ప్రజలకు కూడా సేవ చేసి టిడిపి పార్టీని కాపాడుకుంటూనే ప్రజలకు ఉన్న కష్టాలను తీర్చాడు.

ఇక మొత్తానికైతే ఆయన ఒక హీరోగా, ఒక నాయకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు 13 మంది పిల్లలు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. అందులో హరికృష్ణ, బాలకృష్ణ లు మాత్రమే ప్రేక్షకులందరికీ ఎక్కువగా పరిచయమయ్యారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేశారు. కాబట్టి వారిని మాత్రమే ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరు హాజరు కాలేదనే న్యూస్ అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. మరి తన సొంత కొడుకు పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు రాలేకపోయాడు అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక బాలకృష్ణ తన సోదరుడు అయిన రామకృష్ణ ఇద్దరు కూడా ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్లిద్దరి పెళ్లి 1982 డిసెంబర్ 8 వ తేదీన అయింది. ఇక అప్పుడే కొత్తగా టిడిపి పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరూ ప్రచార యాత్రలో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల ఎన్టీయార్, హరికృష్ణ ఇద్దరు బాలకృష్ణ పెళ్లికి రాలేకపోయారు. నిజానికి బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ వెళితే ఇక్కడ ప్రజలను కలిసే అవకాశం మళ్ళీ రాదనే ఉద్దేశ్యంతో ఆయన పెళ్లికి వెళ్లకుండా ప్రజల కోసమే అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడినుంచే తన బ్లెస్సింగ్స్ ని బాలకృష్ణ దంపతులకు, రామకృష్ణ దంపతులకు పంపించాడు.

ఇక మొత్తానికైతే పెళ్లిళ్లు అయిన తర్వాత ఈ రెండు జంటలు కలిసి ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారట. ఇక ఈ విషయాన్ని నిర్మాత మాగంటి మురళీమోహన్ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ కు జనాలు అంటే ఎంత ఇష్టమో వాళ్లని కలవడానికి ఆయన తన కొడుకు పెళ్లికి సైతం వెళ్లలేదు అనే ఒక సందర్భాన్ని ఉద్దేశించి ఆయన ఈ విషయాన్ని చెప్పడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తున్నాడు.

ఇక ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సీనియర్ హీరోలందరిలో తను కూడా ఒక టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీదనే ఆయన భారీ అసలు పెట్టుకున్నాడు. ఇక ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఈ సినిమాతో నాలుగో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య మరొక సినిమా చేస్తున్నాడు…