Anchors: యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి తెలుగు టీవీ యాంకర్ గా ‘అనసూయ భరద్వాజ్’ ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాగే ఆ తర్వాత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ డిమాండ్ తో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్ట్రలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది అనసూయ. అందుకే, ఇప్పుడు అనసూయ ట్రెండ్ సెట్టర్ అయింది.

ఆమెను చూసి చాలామంది అమ్మాయిలు యాంకరింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. అలా అడుగులు వేస్తోన్న అందరూ అనసూయలా అయిపోవాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడియో ఫంక్షన్స్ లో యాంకరింగ్ చేయడానికి చాలామంది పోటీ పడుతున్నారు. అలాగే జబర్దస్త్ లాంటి ఫుల్ ఫాలోయింగ్ ఉన్న స్టేజ్ ల పై కూడా తమ అందాల మాటలతో గారడీ చేయడానికి వర్ణమాన యాంకర్లు తెగ ఉబలాట పడుతున్నారు.
కానీ అవకాశాలే చాలా తక్కువగా ఉన్నాయి. సుమ, శ్యామల లాంటి వాళ్ళు దాదాపు సినిమా ఈవెంట్స్ అన్నింటిని కవర్ చేసేస్తున్నారు. మధ్యమధ్యలో గాయత్రి భార్గవి, శ్రీముఖి లాంటి వాళ్ళు కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మరి ఇలాంటి పోటీ నేపథ్యంలో ఎందుకు అదనపు యాంకర్ల ప్రయత్నాలు ? స్పెషల్ ప్రోగ్రామ్ లకు యాంకరింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది.
అయితే, క్రేజ్ ఉన్న ఈవెంట్స్ కి కొత్తవాళ్లను ఎవరు ఎంకరేజ్ చేయరు. అలాంటప్పుడు అనవసరమైన ప్రయత్నాలు మానేసి.. వచ్చిన అవకాశాలతో ముందుకు పోతే పూట అయినా గడుస్తోంది. అసలు ఉన్నట్టు ఉండి.. ఎందుకు ? ఈ యాంకర్ల తిప్పల గురించి ప్రస్తావన అంటే.. ఇటీవలే ఓ బడా ఈవెంట్ సంస్థ చుట్టూ అవకాశాల కోసం కొత్త యాంకర్లు తిరుగుతున్నారట.
వారి బలహీనతను ఆ బడా ఈవెంట్ సంస్థలో పని చేసే కొంతమంది మిస్ యూజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా ఆ యాంకర్లు ఎవరో వాస్తవ పరిస్థితులను చుట్టూ ఉన్న మనుషులను పరిశీలిస్తే వారికే మంచిది.