Nani- Merlapaka Gandhi: టాలీవుడ్ లో యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యువ హీరోలలో ఒకడు న్యాచురల్ స్టార్ నాని..ఈయన సినిమా వచ్చిందంటే చాలు..థియేటర్స్ మొత్తం ఫామిలీ ఆడియన్స్ తో కళకళలాడిపోతాయి..ఎన్నో హిట్లు మరియు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన నాని కి ఇప్పుడు గత కొంత కాలం నుండి ఆశించిన స్థాయి విజయాలు రావడం లేదు..అడపాదడపా శ్యామ్ సింఘా రాయ్ వంటి హిట్ సినిమాలు తగులుతున్న కెరీర్ లో మరో లెవెల్ కి వెళ్లే హిట్ అయితే ఇటీవల కాలం లో పడలేదని చెప్పాలి..ప్రస్తుతం ఆయన అభిమానులందరూ లేటెస్ట్ చిత్రం ‘దసరా’ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు..సుమారు 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో..పాన్ ఇండియా లెవెల్ లో నాని కెరీర్ లోనే భారీ ప్రతిష్టాత్మక చిత్రం గా తెరకెక్కుతుంది..శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ప్రేక్షకుల నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత నాని చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ గురించి కూడా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..నాని కెరీర్ జెట్ స్పీడ్ లో టాప్ హీరో రేంజ్ కి ఎదుగుతున్న సమయం లో ఆయన కెరీర్ కి స్పీడ్ బ్రేకర్ లాగ నిలిచినా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’..మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై చతికిల పడింది..ఈ సినిమా తర్వాత మళ్ళీ మెర్లపేక గాంధీ ఇండస్ట్రీ లో కనపడలేదు..చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన శోభన్ అనే హీరో తో ‘లైక్, షేర్ అండ్ సుస్క్రైబ్’ అనే సినిమాని తీస్తున్నాడు..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇది పక్కన పెడితే ఈయన ఇటీవలే నాని ని కలిసి ఒక ఆసక్తికరమైన స్టోరీ లోనే చెప్పాడట..నాని కి ఆ లైన్ బాగా నచ్చడం తో ఈ చిత్రం లో నటించడానికి వెంటనే ఒప్పుకున్నాడట.
Also Read: Young Hero: ఒక్క ప్లాప్ తో 4 ఎకరాలు అమ్మేసిన హీరో.. నిర్మాతలు దూరం.. ఇప్పుడు ఈ హీరో పరిస్థితి ఏంటి ?

అయితే నాని విజయ్ దేవరకొండ లాగ క్రేజీ ప్రాజెక్ట్స్ చెయ్యకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తున్నాడు..కెరీర్ లో టాప్ హీరో అవ్వాలనే కోరిక లేదా అని అభిమానులకు కాస్త అసహనం ఏర్పడింది..కెరీర్ లో పెద్దగా హిట్స్ లేని సమయం లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసి రిస్క్ చెయ్యడం ఎందుకు అని వాళ్ళు వాపోతున్నారు..కానీ మేర్లపాక గాంధీ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడే..ఆయన దర్శకత్వం లో అప్పట్లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మంచి హిట్ గా నిలిచింది..ఇప్పుడు నాని కి కూడా అలాంటి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
Also Read: Shivaji Raja Bandla Ganesh: సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా బండ్ల గణేష్, శివాజీ రాజాల మంచి మనసులు
[…] […]