Young Hero: కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ చూపించాడు. అదృష్టం కలిసి వచ్చి.. రెండో సినిమాకి మంచి బజ్ వచ్చింది. ‘SR కళ్యాణమండపం’తో భారీ హిట్ కొట్టాడు. కానీ, యాక్షన్ హీరో కావాలని కోరిక పుట్టింది. కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో వచ్చిన సినిమా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. ఈ చిత్రం గత వారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా 7 డేస్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 0.23 కోట్లు
సీడెడ్ 0.14 కోట్లు
ఉత్తరాంధ్ర 0.13 కోట్లు
ఈస్ట్ 0.09 కోట్లు
వెస్ట్ 0.06 కోట్లు
గుంటూరు 0.09 కోట్లు
కృష్ణా 0.08 కోట్లు
నెల్లూరు 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణలో 7 డేస్ కలెక్షన్స్ గానూ 0.87 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 1.91 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 కోట్లు
ఓవర్సీస్ 0.07 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ గానూ 0.99 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ గానూ నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా రూ. 1.99 కోట్లను కొల్లగొట్టింది.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 9 కోట్లు జరిగింది. కానీ, ఫస్ట్ వీకెండ్ కి వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. కిరణ్ అబ్బవరం సినిమాకి ఓపెనింగ్స్ కూడా పెద్దగా రావు. పైగా గత రెండు సినిమాలు ప్లాప్. ఎలాగూ మార్కెట్ కూడా లేదు. కాబట్టి ఈ సినిమాకి నష్టాలు తప్పవు. మొత్తానికి ఈ చిత్రానికి వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా కిరణ్ అబ్బవరం సినిమాల్లో ఏది ఉంటుందో ? ఏది ఊడుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి.. కిరణ్ పై ఒత్తిడి పెరిగింది. కొందరు నిర్మాతలు అతనికి ఇప్పటికే దూరం జరిగారు. మొత్తానికి స్టార్ అయ్యే గొప్ప అవకాశాన్ని కిరణ్ అబ్బవరం చెడగొట్టుకున్నాడు. పైగా ఈ సినిమాతో అప్పుల పాలు అయ్యాడు. కారణం ఈ సినిమా రిలీజ్ లో కిరణ్ కొంత డబ్బు పెట్టాడు. దాంతో.. ఆ డబ్బు మొత్తం పోవడంతో రాజంపేటలో కొనుకున్న నాలుగు ఎకరాల భూమి అమ్ముకున్నాడు.Also Read:
Also Read: Shivaji Raja Bandla Ganesh: సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా బండ్ల గణేష్, శివాజీ రాజాల మంచి మనసులు
[…] Also Read: Young Hero: ఒక్క ప్లాప్ తో 4 ఎకరాలు అమ్మేసిన హ… […]