Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Nagarjuna Meets Samantha Father: విడాకుల తర్వాత సమంత తండ్రితో నాగార్జున కీలక భేటి. కథేంటి?

Nagarjuna Meets Samantha Father: విడాకుల తర్వాత సమంత తండ్రితో నాగార్జున కీలక భేటి. కథేంటి?

Nagarjuna Meets Samantha Father: తెలుగు సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అదే కోవలో అప్పటి తరం నుంచి ఇప్పటి వరకు ఎందరో తమ జంటలను వెతుక్కున్నారు. జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో విజయ్ కుమార్ , మంజుల, రాజశేఖర్, జీవిత, నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత కూడా ఉన్నా ఎందుకు సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని ప్రేమ పెళ్లికి అర్థమే మార్చేశారు. మాది ప్రేమ వివాహం అందరికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పినా అనతి కాలంలోనే వారు విడాకులు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో ప్రేమ అంటేనే గౌరవం లేకుండా పోతోందనే వాదనలు కూడా వస్తున్నాయి.

Nagarjuna Meets Samantha Father
Chay, Sam

దీనికి వారి రెండిళ్లలో పెద్దలు కూడా అంగీకరించినా అసలు కారణం ఏంటనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో తమ పిల్లల కాపురం మూడునాళ్ల ముచ్చటే కావడంతో అటు సమంత, ఇటు చైతూ తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. భవిష్యత్ బంగారుమయంగా చేసుకుంటారని అనుకున్నా మధ్యలోనే వారు తమ అన్యోన్యతకు స్వస్తి పలకడం చర్చనీయాంశమే అయింది. ఈ నేపథ్యంలో వారి విడాకుల గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇద్దరు విడిపోయి ఎవరి కెరీర్ ను వారు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చైతు తండ్రి నాగార్జున మాత్రం వీరి తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సమంత తండ్రిని కలిసి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో సమంత కూడా పాల్గొందనే ప్రచారం సాగుతోంది. కొడుకు కాపురం కోసం తండ్రి పడుతున్న ఆవేదనతో అందరిలో ఆలోచనలు పెరుగుతున్నాయి.

Nagarjuna Meets Samantha Father
Nagarjuna Meets Samantha Father

Also Read: Ambati Ayyanna Twitter War: అంబటి వర్సెస్ అయ్యన్న.. కాకరేపుతున్న ట్విట్టర్ యుద్ధం

టాలీవుడ్ లో మంచి జంటగా పేరుతెచ్చుకున్నా ఎందుకో విడిపోవడంతో చాలా మంది షాక్ కు గురయ్యారు. వీరి విడాకులపై రకరకాల విషయాలు వైరల్ గా మారాయి. కానీ అధికారికంగా మాత్రం వారి విడిపోవడానికి ఇప్పటివరకు సరైన కారణం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాగార్జున తనయుడు భవిష్యత్ దృష్ట్యా ఇద్దరు మళ్లీ కలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Nagarjuna Meets Samantha Father
Nagarjuna

వీరి విడాకులకు రెండు కుటుంబాలు అంగీకరించినా తరువాత వారిని కలపాలనే ఆలోచనలోనే ఉన్నట్లు సమాచారం. అందుకే వారి కలయిక కోసం తాపత్రయపడుతున్నారు. సమంత, చైతూను ఎలాగైనా మళ్లీ ఒకటి చేయాలని భావిస్తున్నారు. దీని కోసం ఏ అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. దీంతోనే వారి విడాకులతో అందరికి బాధ కలుగుతున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్ కాలం ఏం నిర్ణయిస్తుందో వేచి చూడాల్సిందే.

Also Read: Y S R Aarogyasri: వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.600 కోట్ల బకాయిలు.. సేవలు నిలిపివేస్తున్న నెట్ వర్క్ ఆస్పత్రులు

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular