Bigg Boss Nataraj Master: బిగ్ బాస్ నాన్ స్టాప్ 11వ వారం యమ రంజుగా సాగింది. ఈ ఆదివారం నాగార్జున ఎంట్రీ ఇచ్చి గత వారమంతా పిచ్చిపట్టినట్టు ప్రవర్తించిన నటరాజ్ మాస్టర్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ఏకి పారేశాడు. నటరాజ్ అన్న మాటలపై తీవ్రస్థాయిలో కడిగిపారేశాడు.
గత వారం నామినేషన్స్ సందర్భంగా బిందుమాధవిపై వ్యక్తిగత విమర్శలతో నటరాజ్ మాస్టర్ ఎంత నీచంగా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. బిందుమాధవి తండ్రి గురించి కూడా నటరాజ్ మాస్టర్ లాగడం దుమారం రేపింది. ‘కూతురు సెంటిమెంట్’ వాడుకుంటున్నావ్ అని ’ బిందుమాధవి కూడా కౌంటర్ ఇచ్చింది.

తెలుగు, తమిళ్, సౌత్, నార్త్ అంటూ బేధాలను చూపించిన నటరాజ్ మాస్టర్ పై నాగార్జున నిప్పులు చెరిగాడు. వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ అంటూ నటరాజ్ కు గడ్డి పెట్టాడు. అంతేకాదు బిందుమాధవి తండ్రిని అన్నందుకు ఆయనకు బిగ్ బాస్ వేదికగా క్షమాపణలు చెప్పించాడు.
Also Read: Ambati Ayyanna Twitter War: అంబటి వర్సెస్ అయ్యన్న.. కాకరేపుతున్న ట్విట్టర్ యుద్ధం
నాగార్జున తప్పులు ఎత్తి చూపడంతో నటరాజ్ మాస్టర్ మోకాళ్ల మీద కూర్చొని ప్రేక్షకులందరికీ క్షమాపణలు చెప్పారు. ఇక నటరాజ్ మాస్టర్ పై ‘రా’, ‘తూ’ అంటూ పక్కకు ఉమ్మిన బిందుమాధవిని నాగార్జున మందలించారు. తను చేసిన తప్పులను అంగీకరించిన బిందు హుందాగా మాస్టర్ తనకంటే పెద్దవాడని అలాంటి అనకూడదని నాగార్జున కోరిక మేరకు సారీ కూడా చెప్పి తన నిబద్దతను చాటుకుంది. బాబా బాస్కర్, అరియానాకు కూడా నాగార్జున కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు.

షో చివరి దశకు రావడం.. పోటీ ఎక్కువ కావడంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య అస్సలు బంధాలు, అనుబంధాలు లేకుండా పోయాయి. ఇన్ని రోజులు కలిసి ఉన్న వారంతా ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కావాలని కసిగా ఆడుతూ అడ్డువచ్చిన వారిపై మాటలు, గేమ్ తో విరుచుకుపడుతున్నారు. తోటి కంటెంస్టెంట్లపై ఎలాంటి కనికరం చూపించడం లేదు. దీంతోనే హౌస్ లో గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అది ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ పంచుతోంది. అయితే ఈ వారం కాస్త శృతిమించినట్టే కనిపించింది. అందుకే నాగార్జున ప్రతీ వారం కంటే ఈ వారం కాస్త ఎక్కువగానే సీరియస్ అయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో బింధుమాదవి ముందంజలో ఉన్నారు. అఖిల్ పోటీనిస్తున్నాడు.కప్ ఎవరికి వస్తుందన్నది వేచిచూడాలి.
Recommended Videos:
[…] Also Read: Bigg Boss Nataraj Master: ఏకి పారేసిన నాగార్జున.. మోకా… […]
[…] Also Read:Bigg Boss Nataraj Master: ఏకి పారేసిన నాగార్జున.. మోకా… […]