Kamal Haasan And Rajinikanth: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను అందుకొని ముందుకు దూసుకెళ్లిన ఘనత కూడా వాళ్లకే దక్కుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే కమల్ హాసన్ లాంటి నటుడు సైతం వైవిధ్యభరితమైన సినిమాలను ఎంచుకొని సక్సెస్ లను సాధించాడు. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన రజినీకాంత్ సైతం మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. నిజానికి కమల్ హాసన్ రజనీకాంత్ కంటే సీనియర్ హీరో… అలాగే రజినీకాంత్ ఇండస్ట్రీకి వచ్చేసరికి కమల్ హాసన్ టాప్ హీరోగా ఉన్నాడు. మరి ఇలాంటి కమల్ హాసన్ నెంబర్ పొజిషన్ ను దక్కించుకోకపోడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే కమల్ హాసన్ చేసే సినిమాలు ఆఫ్ బీటెడ్ సినిమాలు అవి కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతాయి. కానీ రజనీకాంత్ చేసే సినిమాలు కమర్షియల్ సినిమాలు అవి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతాయి… ముఖ్యముగా రజినీ కాంత్ సినిమాల్లో మాస్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు బీ,సీ సెంటర్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంటాయి. ఇక దాంతో పాటుగా రజనీకాంత్ సినిమాలను రిపీటెడ్ గా చూసే జనాలు ఎక్కువైపోయారు. దాని వల్ల అతని సినిమాలకు కలెక్షన్స్ కూడా భారీగా రావడం ఇంతకుముందు వచ్చిన సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగడం వల్ల రజనీకాంత్ నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకున్నాడు. కమల్ హాసన్ చేసే సినిమాలు క్లాస్ సినిమాలు…
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
వాటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించిన కూడా భారీ రేంజ్ లో రాకపోవడం ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడకపోవడం వల్ల ఆయన రజనీకాంత్ ని బీట్ చేయలేకపోయాడు…అందుకే మాస్ హీరోగా కొన్ని సినిమాలు చేసి ఉంటే అతనికి కూడా మాస్ ఇమేజ్ వచ్చి ఉంటే అప్పుడు కమల్ హాసన్ సైతం రజినీకాంత్ మాదిరిగానే నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడానికి అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది…మరి ఏది ఏమైనా కూడా గత 50 సంవత్సరాలు నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు రజినికాంత్ కావడం విశేషం…
ఇక ఇప్పటివరకు రజనీకాంత్ చేసిన సినిమాలన్నీ ఆయనను నెంబర్ వన్ పొజిషన్లో నిలపడానికి ప్రయత్నం చేశాయి. ఇక ఆయన దర్శకులు సైతం అతని చేత స్టైలిష్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ని చేయిస్తూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టడంలో కీలకపాత్ర వహించారు…