Deep Vein Thrombosis: వాతావరణ కలుషితం, తినే ఆహారం కల్తీగా మారడంతో అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. సరైన ఆహారం లేక… తిన్న ఆహారం సరైన సమయంలో జీర్ణం కాక.. అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటీవల చాలా మందిలో రక్త ప్రసరణ లో అడ్డంకులు ఏర్పడి గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడి ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. అయితే ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు DVT. ఇది ఎక్కువగా కాళ్లలో ఏర్పడి.. రక్తప్రసరణ పై ప్రభావం చూపుతోంది. దీంతో ఊపిరితిత్తులకు ఆక్సిజన్ కూడా అందకుండా పోతుంది. అయితే దీని లక్షణాలు.. ఇది రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Deep Vein Thrombosis(DVT) ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. శరీరంలోని లోతైన శిరల్లో అంటే కాళ్ళ నరాల్లో రక్తం గడ్డ కట్టడం.. ఇది విడిపోయి ఊపిరితిత్తులకు చేరడం వల్ల ప్రాణాలకే ముప్పు వస్తుంది. కాళ్లలో విపరీతమైన నొప్పి లేదా వాపు ఉండడం.. కాళ్ళ చర్మం రంగు మారడం.. తిమ్మిర్లు ఎక్కువగా ఉండడం.. కండరాల నొప్పులు వంటివి డివిటి లక్షణాలు. ఇది ఎక్కువగా వృద్ధాప్యంలో ఉన్నవారికి వస్తుంది. అంతేకాకుండా ఎవరైనా శాస్త్ర చికిత్స చేసుకుంటే ఆ తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. గుండెలో సమస్యలు ఉన్నవారికి.. జన్యు సంబంధిత పేగు వ్యాధులు ఉన్నవారికి ఇది ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూర్చొని ఉండే వారికి కూడా ఇది వెంటాడుతుంది.
అనుకోకుండా లేదా కొన్ని రకాల చికిత్సల తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా కాళ్లలో ప్రారంభమైన ఇది ఊపిరితిత్తులకు చేరకుండా అడ్డుకోవాలి. అలా ఊపిరితిత్తులకు పాకితే శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రాణాలు కూడా పోవచ్చు. అంతేకాకుండా డివిటి ఏర్పడిందని తెలిసిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదట్లోనే దీన్ని గుర్తించి సరైన చికిత్సతో పాటు కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: ఇలాంటి వాకింగ్ చేస్తే మీకే ఆరోగ్య సమస్యలు రావు
ఇలాంటి లక్షణాలు ఎవరైనా గుర్తిస్తే ఎక్కువసేపు కూర్చోవడం చేయదు. అలాగే ఒకే చోట ఎక్కువసేపు నిలబడిన కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయడం.. చురుకుగా పనిచేయడం.. ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిని పూర్తి చేయడం వంటి వి చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా రక్తప్రసరణ మెరుగ్గా ఉండే ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల డివిటిని అడ్డుకోవచ్చు. అయితే ఇటీవల కొందరు తక్కువ వయసు ఉన్నవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం శారీరకంగా వ్యాయామం లేకపోవడమే. ప్రతిరోజు తప్పనిసరిగా ఏ వయసు వారైనా వ్యాయామం చేయాలి. లేదా రక్తప్రసరణ మెరుగ్గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడాలి. లేదా మానసికంగా విశ్రాంతి పొందాలి. ఇలా తమ జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లయితే దీని నుంచి బయటపడవచ్చు.