Mirai saved People Media Factory: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(Peoples Media Factory)..ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ని వివిధ దేశాల్లో విజయవంతంగా నడుపుతూ కోట్ల రూపాయిలను సంపాదించిన విశ్వ ప్రసాద్(Viswa prasad) అనే వ్యక్తి సినిమాల మీద విపరీతమైన ఇష్టం తో నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టాడు. ఏ ముహూర్తం లో అడుగుపెట్టాడో కానీ, ఈ సంస్థ లో సూపర్ హిట్ సినిమాలకంటే డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా ఈ సంస్థ నుండి విడుదలైన ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూ లో విశ్వప్రసాద్ ఈమధ్య వచ్చిన ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడుతూ, ఏ నిర్మాత చూడని విధంగా మేము ట్రిపిల్ డిజిట్ లాస్ ని గత మూడు సినిమాల ద్వారా చూడాల్సి వచ్చింది, మిరాయ్ చిత్రం తో మేము మళ్లీ కం బ్యాక్ ఇస్తామంటూ చెప్పుకొచ్చాడు.
ఆయన చెప్పినట్టు గానే తధాస్తు దేవతలు తధాస్తు అని దీవించినట్టు ‘మిరాయ్'(Mirai Movie) చిత్రానికి జరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ ప్రభావం కారణంగా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకు మొదటి రోజు 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తుంది. ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ బాగా ఉంటే ఇంకా ఎక్కువ వసూళ్లు నమోదు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో అనేది. ఒకవేళ హనుమాన్ లాగా ఈ సినిమా కూడా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పంట పండినట్టే అనుకోవచ్చు. సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన నష్టాలన్నీ పూడినట్టే.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఆయన తీస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. సంక్రాంతి కానుకగా, జనవరి 9 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే ఈ సంస్థ కుంభస్థలం బద్దలు కొట్టినట్టే. ఎందుకంటే ప్రభాస్ సినిమా సూపర్ హిట్ అయితే లెక్క 600 కోట్ల రూపాయిల నుండి మొదలు అవుతుంది. ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా 300 గ్రాస్ వస్తాయి. కాబట్టి ఇక నుండి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి అన్ని మంచి మంచి రోజులే ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి.