Manchu Manoj remuneration: ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలిగిన సినిమాని చూశామని, మేము పెట్టిన టికెట్ రేట్ కి సంపూర్ణమైన న్యాయం జరిగింది అంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తేజ సజ్జ, మంచు మనోజ్ క్యారెక్టర్స్ గురించి బలంగా మాట్లాడుకుంటున్నారు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ కి బలమైన క్యారక్టర్ పడిందని, సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు హీరో క్యారక్టర్ కి ఏ మాత్రం తక్కువ లేకుండా మనోజ్(Manchu Manoj) క్యారక్టర్ కొనసాగిందని అంటున్నారు.
అయితే ఈ సినిమాకు హీరో తేజ సజ్జ కంటే మంచు మనోజ్ ఎక్కువ రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సోషల్ మీడియా లో వినిపిస్తున్న టాక్. తేజ సజ్జ ఇంకా హీరో గా నిలదొక్కుకోని రోజుల్లో ఒప్పుకున్న సినిమా అని, అప్పట్లో ఆయన మార్కెట్ వేల్యూ ని బట్టి చూస్తే ఈ సినిమాకు కేవలం కోటి నుండి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకున్నాడని అంటున్నారు. ఇక మంచు మనోజ్ ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోనే. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఈ చిత్రానికి దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. అంటే హీరో తేజ సజ్జ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అన్నమాట. రీ ఎంట్రీ లో మంచు మనోజ్ కి మంచి సూపర్ హిట్ తగిలిందనే అనుకోవాలి.
వాస్తవానికి ఈ చిత్రానికి ముందు ఆయన ‘భైరవం’ అనే చిత్రాన్ని రీసెంట్ గానే విడుదల చేసాడు. ఈ సినిమాలో మనోజ్ క్యారక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముందుగా ఆయన ‘మిరాయ్’ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. కానీ ముందుగా భైరవం చిత్రం విడుదలైంది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయినా, మిరాయ్ చిత్రం కమర్షియల్ గా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ కొట్టడం తో మనోజ్ కి రాబోయే రోజుల్లో ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయని ఆశించవచ్చు. ఇక తేజ సజ్జ విషయానికి వస్తే, ఇతనికి ఇంతటి లోతైన సబ్జక్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయో అసలు అర్థం కావడం లేదు. స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ స్క్రిప్ట్స్ ని ఎంచుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈయన ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియన్ స్టార్ హీరో అయిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.