Waltair Veerayya Collections: హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా చెక్కు చెదరని క్రేజ్ మరియు స్టార్ స్టేటస్ తో ఉండే హీరోలు మన సౌత్ లో చాలా తక్కువమంది ఉంటారు..ఆ తక్కుమందిలో ఒకరే మెగాస్టార్ చిరంజీవి..’ఆయన స్థాయి వేరు..స్థానం వేరు’ అనే ట్యాగ్ కి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన ఆయన సుదీర్ఘ ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుగులు ఎదురుకున్నాడు.

ఎన్నో సక్సెస్ లు చూసాడు..అలాగే ఫెయిల్యూర్స్ కూడా చూసాడు..కానీ చిరంజీవి సక్సెస్ ని చూసి ఓర్వలేని ఒక వర్గపు మీడియా మరియు ప్రజలు ఆయన డిజాస్టర్ ఫేస్ ని చూసి ‘చిరంజీవి పని ఇక అయిపోయింది’ అంటూ రాక్షసానందం పొందేవాళ్ళు..కానీ వాళ్ళ అనందం ని మూడునాళ్ళ ముచ్చటగా చెయ్యడం మెగాస్టార్ స్టైల్..పడిపోయాడు అని అనుకున్న ప్రతీసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే కంబ్యాక్ తో కారుకూతలు కూసే దురాభిమానుల నోర్లను మూయించేవాడు.
9 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీలగా కొట్టి తన స్టార్ స్టేటస్ ఎలాంటిదో మరోసారి అందరికీ రుచి చూపించాడు మెగాస్టార్..కానీ ‘వాల్తేరు వీరయ్య’ కి ముందు విడుదలైన చిరంజీవి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు.. చిరంజీవి డౌన్ ఫాల్ ని చూసి సంబరాలు చేసుకునే దురాభిమానులు మరోసారి ‘చిరంజీవి పని అయిపోయింది’ అంటూ తన దగ్గర దశాబ్దాల నుండి ఉన్న పచ్చ మీడియాతో ఊదరగొట్టించారు..67 ఏళ్ళ వయస్సు వచ్చింది..ఇప్పుడు చిరంజీవి సినిమాలు చెయ్యడమే ఎక్కువ..ఇంకా ఆయన నుండి రికార్డ్స్ ఏమని ఆశిస్తాము లే అని అనుకోని ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో మరోసారి ప్రభంజనం సృష్టించి వారం రోజుల్లో వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకొని తన స్టార్ పవర్ ఏంటో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసాడు..అందుకే పొరపాటున కూడా మెగాస్టార్ స్టార్ స్టేటస్ ని తక్కువ అంచనా వెయ్యొద్దు..తన కష్టం తో నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న అభిమానుల కోట అది..ఒక్క ఫ్లాప్ తో కూలిపోదు అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ట్రేడ్ పండితులు సైతం.