Megastar Chiranjeevi: ఆ సమస్యపై కలిసికట్టుగా పని చేయాలి అంటున్న మెగాస్టార్ చిరంజీవి…

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తనదైన నటనతో, డాన్స్ లతో కోట్లాది మండి అభిమానులను సంపాదించుకున్నారు చిరు. అలానే కేవలం సినిమాల పరంగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడు ముందుంటారు మెగాస్టార్. అలానే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటారు. గత వారం రోజులుగా ఏపీ, తమిళనాడు ప్రాంతాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారి నేటి ఉదయం తీరాన్ని […]

Written By: Raghava Rao Gara, Updated On : November 19, 2021 4:09 pm
Follow us on

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తనదైన నటనతో, డాన్స్ లతో కోట్లాది మండి అభిమానులను సంపాదించుకున్నారు చిరు. అలానే కేవలం సినిమాల పరంగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడు ముందుంటారు మెగాస్టార్. అలానే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటారు. గత వారం రోజులుగా ఏపీ, తమిళనాడు ప్రాంతాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారి నేటి ఉదయం తీరాన్ని దాటిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

నిన్న కురిసిన భారీ వర్షాలతో ఏపీలో ముఖ్యంగా తిరుమల, తిరుపతిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. కొండ చరియలు విరిగిపడటంతో శ్రీవారి దర్శనాలకు సైతం అవాంతరాలు ఏర్పడ్డాయి. నేటి ఉదయం పరిస్థితి కాస్త మెరుగవడంతో ఓ మార్గంలో రాకపోకలకు టీటీడీ అనుమతి ఇచ్చింది. తాజాగా దీనిపై చిరంజీవి స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి. ఆ పోస్ట్ లో ‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్సాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు వచ్చేలా చేయండి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నానంటూ’ ట్వీట్ చేశారు. వాయుగుండం తీరాన్ని దాటినా 24 గంటలపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉండనుందని అధికారులు తెలిపారు.