YCP Social Media: జూన్ 4 తర్వాత వైసీపీ సోషల్ మీడియా విభాగం పరిస్థితి ఏంటి?

వైసీపీ సోషల్ మీడియా చేసే ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఈ లెక్కన అన్ని రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలది అదే పరిస్థితి. కానీ అధికార మదంతో ఉన్న వైసీపీ సోషల్ మీడియా తీరు వేరేగా ఉంది.

Written By: Dharma, Updated On : May 10, 2024 6:03 pm

YCP Social Media

Follow us on

YCP Social Media: అన్ని రాజకీయ పక్షాలకు సోషల్ మీడియా విభాగాలు ప్రధానం అయ్యాయి. గతంలో పార్టీల బలోపేతానికి, ఉనికికి అనుబంధ సంఘాలు దోహదపడేవి. ఇప్పుడు సీన్ మారింది. పార్టీలో అధినేత తరువాత సోషల్ మీడియా విభాగం అధిపతికే అన్ని పవర్స్ ఉన్నాయి. పార్టీలో సైతం మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే వైసిపికి అన్ని తానై వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి.. సోషల్ మీడియా విభాగాన్ని తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి చేతిలో పెట్టారు. గత ఎన్నికలకు ముందు.. తరువాత వైసిపి సోషల్ మీడియా విభాగం విజయసాయిరెడ్డి చేతిలో ఉండేది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో భార్గవ రెడ్డికి పగ్గాలు అప్పగించారు జగన్. అయితే ప్రభుత్వ నిఘా సంస్థలతో పాటు పోలీస్ యంత్రాంగాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న భార్గవ్ రెడ్డి ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు.అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. అందుకే ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ఉండగానే.. అదే సోషల్ మీడియా విభాగంపై సిఐడి కేసులు నమోదు చేయడం విశేషం.

వైసీపీ సోషల్ మీడియా చేసే ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఈ లెక్కన అన్ని రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలది అదే పరిస్థితి. కానీ అధికార మదంతో ఉన్న వైసీపీ సోషల్ మీడియా తీరు వేరేగా ఉంది. వైసిపి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి రాద్ధాంతం చేస్తోంది. మీ భూములను వైసీపీ ప్రభుత్వం లాక్కుంటుందని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ముఖ్యంగా టిడిపి సోషల్ మీడియా ఈ విషయంలో ముందంజలో ఉంది. దీంతో డ్యామేజ్ తప్పదని భావిస్తున్న వైసిపి కేసులు నమోదు ప్రారంభించింది. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారంపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరడంతో.. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. ఈసీ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి సిఐడి పై ఏర్పడింది. తొలిసారిగా ఈ పరిస్థితి తలెత్తేసరికి వైసీపీ సోషల్ మీడియాకు మైండ్ బ్లాక్ అవుతోంది.

ప్రస్తుతం ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నా.. ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నామని.. మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. అయితే తాజాగా వైసీపీ సోషల్ మీడియా పై సిఐడి కేసులు నమోదవుతున్న లైట్ తీసుకుంటున్నారు. ఎన్నికల అయ్యేవరకు సజ్జల భార్గవ్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా విభాగానికి వచ్చే సమస్య లేదు. కానీ జూన్ 4 తర్వాత ఫలితం మారితే మాత్రం చిక్కుల్లో పడే పరిస్థితి ఉంది. సోషల్ మీడియా విభాగం నుంచే వైసీపీ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.