Homeఎంటర్టైన్మెంట్Hero Movie: ‘హీరో’ మూవీపై స్పందించిన మహేష్.. ఏమన్నాడంటే?

Hero Movie: ‘హీరో’ మూవీపై స్పందించిన మహేష్.. ఏమన్నాడంటే?

Hero Movie: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఆశీస్సులతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ‘హీరో’ మూవీతోనే గల్లా అశోక్ హీరోగా పరిచయం కానుండటం విశేషం. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘హీరో’ మూవీపై తన స్పందనను ట్వీటర్లో వెల్లడించారు.

kannada senior hero going to play important role in mahes babu movie

‘హీరో’ మూవీని తాను చూశానని.. తనకు ఎంతో బాగా నచ్చిందని మహేష్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గల్లా అశోక్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చిత్రబృందానికి ముందస్తుగానే కంగ్రాట్స్ చెప్పారు. అశోక్ సినిమాల కోసం గత ఐదారేళ్లుగా కష్టపడుతున్నాడని అతడి హర్డ్ వర్క్ విజయం తెచ్చిపెడుతుందన్నారు.

ఆ రోజుల్లో సంక్రాంతి పండుగ కృష్ణగారికి బాగా కలిసొచ్చిందన్నారు. ఆ తర్వాత ఆ సెంటిమెంట్ తనకు కూడా కలిసి వచ్చిందని తెలిపారు. సంక్రాంతికి రిలీజైన తన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని మహేష్ బాబు గుర్తు చేశారు. 2022 సంక్రాంతికి వస్తున్న ‘హీరో’ కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

ఈ సంక్రాంతికి తమ ఫ్యామిలీ నుంచి వస్తున్న అశోక్ కు తన అభిమానుల సపోర్టు ఉంటుందని తెలిపారు.  ‘హీరో’ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఓ వీడియో సందేహాన్ని ఆయన ట్వీటర్లో పోస్టు చేశారు. ఇక ఈ మూవీలో గల్లా అశోక్ సరసన బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular