Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: రాజకీయ ఎంట్రీపై స్పందించిన చిరంజీవి..!

Chiranjeevi: రాజకీయ ఎంట్రీపై స్పందించిన చిరంజీవి..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెల్సిందే. ‘ఖైదీ-150’తో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని చిరంజీవి నిరూపించుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా నర్సింహారెడ్డి’లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ అనుకున్న మేర కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

ఇక చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆచార్య’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కావడం ఖాయంగా కన్పిస్తోంది.  అలాగే దర్శకుడు మెహర్ రమేష్ తో ‘వేదాళం’ రీమేక్, డైరెక్టర్ బాబీలతో ఒక్కో సినిమాను లైన్లో పెట్టాడు.

‘ఆచార్య’ తర్వాత ఒకేసారి నాలుగైదు సినిమాలను చిరంజీవి సైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మూడు షిప్టుల్లో మెగాస్టార్ సినిమాలను చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఇండస్ట్రీలో నటీనటులంతా కరోనా బారిన పడుతుండటంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఇటీవలే సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి సినిమా టికెట్ల ధరలు, ఇతరత్ర సమస్యలపై ఆయనకు వివరించారు. పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. త్వరలోని అందరికీ ఆమోదయోగ్యకరమైన నిర్ణయం వస్తుందన్నారు. అయితే చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

‘తాను మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి రావడం జరగదని.. దయచేసి ఇలాంటి ఊహగాన వార్తలకు పుల్ స్టాప్ పెట్టండి’ అంటూ ట్వీటర్ వేదికగా చిరంజీవి కోరారు. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని ‘తెలుగు సినీ పరిశ్రమ కోసం, థియేటర్ల మనుగడ కోసం కలిశానని.. ఆ చర్చలను పక్కదోవ పట్టించేలా రాజకీయ రంగు పులుముతున్నారు.. వైఎస్సార్‌సీపీ నాకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసిందనడం’లో వాస్తవం లేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular