https://oktelugu.com/

Krishna Vamsi: మురారి మూవీ ప్లాప్ అయిందా..? సంచలన కామెంట్లు చేసిన కృష్ణవంశీ…

గులాబీ సినిమాతో కృష్ణ వంశీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఆయన సక్సెస్ అయ్యాడు ఇక ఆ తర్వాత చేసిన నిన్నే పెళ్ళాడుతా, అంతఃపురం, సింధూరం లాంటి సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : July 21, 2024 / 03:46 PM IST

    Krishna vamshi murari

    Follow us on

    Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే మంచి సినిమాలను తీసి ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటారో వాళ్ళకి ఇండస్ట్రీ లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక వాళ్ల సినిమాల కోసం ప్రేక్షకులు కూడా వేయి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు ఫ్యామిలీ సబ్జెక్టులతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన మొదటి నుంచి కూడా వైవిద్య భరితమైన జానర్స్ ని ఎంచుకుంటూ సినిమాలు చేశాడు. అందుకే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ అయితే పెరిగింది. ఇక దాన్నిబట్టి ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమం లో కృష్ణ వంశీ సినిమాలు చేస్తూ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా ‘క్రియేటివ్ డైరెక్టర్’ గా కూడా ప్రేక్షకులందరి చేత తనదైన మన్ననలు పొందాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుతో ‘మురారి’ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా యూత్ లో కూడా మహేష్ బాబుకి మంచి ఫాలోయింగ్ ను తీసుకురావడంలో చాలావరకు హెల్ప్ అయింది. ఇక మహేష్ బాబు కెరియర్ లో మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా మురారి నే కావడం విశేషం… అలాగే మహేష్ బాబు కెరియర్ లో కూడా ఆయనకు ఈ సినిమా ఒక మైలురాయి అని తను కూడా అభిప్రాయపడుతూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే కృష్ణవంశీ తన ఎంటైర్ కెరియర్లో తీసిన మొత్తం సినిమాల్లో ఈ సినిమా టాప్ 5 లో నిలుస్తుంది. ఇక ఈ సినిమా మీద ఆయన పెట్టిన కేర్ కూడా చాలా గొప్ప గా ఉంటుంది.

    ఇక ఇలాంటి క్రమం లోనే మురారి సినిమా టాపిక్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాని ప్లే చేయాలనే ఉద్దేశ్యం తో దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాని కోసమే రీసెంట్ గా కృష్ణవంశీ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ఆయన రీసెంట్ గా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తన అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యారు.

    ఇక అందులో భాగంగా కొంతమంది అభిమానులు ఆయనతో ఆ సినిమాకు సంభందించిన విషయాలను పంచుకున్నారు.ఇక ఒక వ్యక్తి మాత్రం మురారి ప్లాప్ సినిమా అంటూ కామెంట్ చేశాడు. ఇక అతని కామెంట్ కి స్పందించిన కృష్ణవంశీ మురారి సినిమాను మా ఏరియాలో 55 లక్షలు పెట్టి నేను కొన్నాను. అది ఒక కోటి 30 లక్షల వరకు వసూళ్లను రాబట్టింది. ఫైనాన్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయిందా అనుకుందామంటే నేను పెట్టిన పెట్టుబడికి డబుల్ అమౌంట్ నాకు వచ్చింది. కాబట్టి ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినట్టే కదా…ఇక కథ పరంగా చూసుకుంటే సినిమా ఆడియన్స్ అందరికీ రీచ్ అయింది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ ఫుల్ సినిమా అనే చెప్పాలి. మరి ఫ్లాప్ సినిమా అని మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు అంటూ తను పోస్ట్ చేశాడు.

    ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మరి కొంతమంది కృష్ణవంశీ అభిమానులు మాత్రం మురారి సినిమా కృష్ణవంశీ కెరియర్ లోనే టాప్ 3 మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది. ఆ సినిమాలో ఉన్న ఫీల్ అలాంటిది. అంటూనే కృష్ణవంశీ గారిని ఉద్దేశిస్తూ సార్ మీ సినిమాల వాల్యూ తెలిసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు సార్…అందువల్లే వాళ్లు వాటిని ఫ్లాప్ అంటూ పరిగణిస్తారు. కానీ ఈ సినిమా మాత్రం యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ అమితంగా నచ్చేసింది అంటూ కామెంట్ చేశారు.. ఇక మొత్తానికైతే కృష్ణవంశీ ఈ సినిమా ఫ్లాప్ కాదు సూపర్ సక్సెస్ అయింది అని చెప్పడమే కాకుండా, అభిమానులు కూడా ఈ సినిమా మీద పొగడ్తల వర్షం కురిపించారు…