https://oktelugu.com/

Mahesh Babu Vs Vijay: మహేష్ బాబు కంటే విజయ్ స్టార్ హీరోనా..? మళ్ళీ స్టార్ట్ అయిన ఫ్యాన్ వార్..? ఇద్దరిలో ఎవరు టాప్ హీరో..?

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా మనందరి అదృష్టం అనే చెప్పాలి. ఇక మొదట్లో మహేష్ బాబుకి కొన్ని ప్లాప్ లు వచ్చినప్పటికి ఆ తర్వాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : July 21, 2024 / 03:36 PM IST

    Mahesh Babu Vs Vijay

    Follow us on

    Mahesh Babu Vs Vijay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఆయన వరుస సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో ఈయన చేసిన ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ హిట్స్ గా మిగిలిపోయాయి. ఈ సినిమాల విషయంలో ఆయన చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. ఇక అందులోనూ వీళ్ళ తండ్రిగారైన కృష్ణ గారి పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మహేష్ బాబు ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలా అయితే మహేష్ బాబు మాస్ హీరోగా ఎదుగుతాడు. అనే విధంగా కృష్ణ చాలా కసరత్తులను చేసి ఆయా దర్శకులతో కాంబినేషన్స్ ని సెట్ చేసి మొత్తానికైతే మహేష్ బాబుని ఒక స్టార్ హీరోగా మార్చడంలో తను కీలక పాత్ర వహించాడు. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం ఎన్నో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా లేడీ అభిమానులైతే ఆయన నటనకు, ఆయన అందానికి ఫిదా అయిపోతుంటారు. తెలుగులో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కూడా మహేష్ బాబు గారే కావడం విశేషం…

    ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ మధ్య చాలా రోజుల నుంచి తీవ్రమైన గొడవలైతే జరుగుతున్నాయి. మహేష్ బాబు చేసిన ఒక్కడు, పోకిరి సినిమాలను విజయ్ తమిళంలో రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అయినప్పటికీ మహేష్ బాబు యాక్టింగ్ కంటే విజయ్ యాక్టింగ్ చాలా బాగుంది అంటూ చాలామంది తమిలియన్లు మహేష్ బాబు ను ట్రోల్ చేస్తున్నారు. ఒకరకంగా ఈ రెండు సినిమాలను కనక మనం చూసుకున్నట్లయితే ఈ రెండు సినిమాల్లో కూడా మహేష్ బాబు యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది.

    విజయ్ యాక్టింగ్ తో పోల్చిన కూడా మహేష్ బాబు యాక్టింగ్ లో ఒక పరిణితి అనేది కనిపిస్తుంది. కాకపోతే మన తెలుగు వాళ్ళని మెచ్చుకోవడం ఇష్టం లేక తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు కావాలనే మహేష్ బాబు మీద ఇలాంటి బురద జల్లుతున్నారు. ఇక మనవాళ్లు సైతం వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా విజయ్ మీద చాలా కౌంటర్లు వేస్తున్నారు. అయితే కొద్ది రోజులా క్రితం ఈ గొడవ అనేది జరిగింది ఆ తర్వాత ముగిసిపోయింది. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఒక్కడు, మురారి రెండు సినిమాలని మొదటి రెండు షోస్ కి ‘ఒక్కడు ‘ సినిమాని, లాస్ట్ రెండు షోస్ కి ‘మురారి ‘ సినిమాని ప్రదర్శించాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నారు.

    కాబట్టి ఈ సందర్భంలో మళ్లీ ఒక్కడు ప్రస్తావన రావడంతో తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మహేష్ బాబు మీద కామెంట్స్ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అనే విషయాన్ని మనం కనుక పరిశీలించినట్లైతే మహేష్ బాబు బెస్ట్ నటుడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే విజయ్ యాక్టింగ్ అనేది అంత నచురల్ గా అనిపించదు. కానీ మహేష్ బాబు మాత్రం ప్రతి సీన్ లో తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టి యాక్ట్ చేస్తూ ఉంటాడు…ఇక ఎమోషనల్ సీన్స్ లో అయితే మహేష్ బాబు చెలరేగిపోతాడు. కానీ విజయ యాక్టింగ్ అన్నివేళలా ఒకేలా ఉంటుంది…