
Keeravani Emotional: మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కన్నీరు పెట్టుకున్నారని ఆయన తమ్ముడు రాజమౌళి తెలియజేశారు. అయితే కీరవాణి బాధతో పెట్టిన కన్నీళ్లు కావవి. ఆనందబాష్పాలు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రిచర్డ్ కార్పెంటర్ ఇందుకు కారణమయ్యారు. కీరవాణితో పాటు లిరిసిస్ట్ చంద్రబోస్ ని రిచర్డ్ కొనియాడారు. ఆస్కార్ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… తన కుటుంబంతో పాటు ఒక సాంగ్ పాడారు. ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
రిఛర్ట్ కార్పెంటర్ తనకు నేరుగా శుభాకాంక్షలు చెప్పడంతో కీరవాణి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయట. ఈ విషయాన్ని రాజమౌళి కామెంట్ రూపంలో తెలియజేశారు. రిచర్డ్ సర్… మా అన్నయ్య ఆస్కార్ జర్నీ మొత్తంలో ఎక్కడా భావోద్వేగానికి గురికాలేదు. అవార్డు గెలిచాక గెలవక ముందు కూడా ప్రశాంతత మైంటైన్ చేశారు. కానీ శుభాకాంక్షలతో కూడిన మీ సందేశం చూశాక… కంట్రోల్ కాలేకపోయారు. ఆయన కన్నీరు కార్చారు, అని పోస్ట్ చేశారు.
ఆస్కార్ అందుకునేందుకు వేదికపైకి వెళ్లిన కీరవాణి రిచర్డ్ కార్పెంటర్ ని తలచుకున్నారు. ప్రఖ్యాత సినిమా వేదికపై ఆయన పేరు మెన్షన్ చేశారు. చిన్నప్పటి నుండి నేను కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగాను. ఇప్పుడు ఆస్కార్ అందుకునే స్థాయికి వచ్చాను అన్నారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావించని కీరవాణి, సినిమాతో ఎలాంటి సంబంధం లేని కార్పెంటర్ తనకు స్ఫూర్తి అన్నట్లు పరోక్షంగా చెప్పారు.

ఈ క్రమంలో తన అభిమాని కీరవాణికి కార్పెంటర్ స్పెషల్ అండ్ సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. బెస్ట్ విషెస్ తెలియజేస్తూ వీడియో పోస్ట్ చేశారు. 95వ ఆస్కార్ అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ కి అవార్డు దక్కింది. నాటు నాటు సాంగ్ కి కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. మార్చి 13న(భారత కాలమానం) జరిగిన ఆస్కార్ ఈవెంట్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ తరపున రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాల్గొన్నారు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇదో అరుదైన విషయం. ఒక తెలుగు సినిమాకు, పాటకు ఆస్కార్ రావడం చరిత్రలో నిలిచిపోయే పరిణామం.
View this post on Instagram