Sardar 2: కార్తీ ‘సర్దార్ 2’ సినిమా షూటింగ్ లో చనిపోయిన స్టంట్ మ్యాన్…తమిళ్ సినిమా ఇండస్ట్రీ లోనే ఇలా ఎందుకు జరుగుతోంది…

కార్తీ తెలుగులో డబ్ చేస్తూ మంచి విజయాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన డ్యూయల్ రోల్ లో 'సర్దార్ ' అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'సర్ధార్ 2' అనే సినిమాని చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : July 17, 2024 1:41 pm

Sardar 2

Follow us on

Sardar 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న నటులు చాలామంది ఉన్నప్పటికీ అందులో కార్తీ మాత్రం తనకంటూ సపరేట్ గుర్తింపును సంపాదించుకున్నాడనే చెప్పాలి. ఆయన ఎమోషన్ సీన్స్ అయిన, కామెడీ సీన్స్ అయిన చాలా అలవోకగా చేస్తూ సగటు ప్రేక్షకుడిని అలరిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య సూర్య ఇండస్ట్రీ లో సక్సెస్ అయిన తర్వాత కార్తీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసిన యుగానికి ఒక్కడు, ఆవారా లాంటి సినిమాలు కెరీర్ మొదట్లోనే ఆయనకు సూపర్ సక్సెస్ లను సాధించాయి.

ఇక ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనకు ఇక్కడ కూడా భారీ మార్కెట్ అయితే ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తూ మంచి విజయాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన డ్యూయల్ రోల్ లో ‘సర్దార్ ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘సర్ధార్ 2’ అనే సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమా యూనిట్ నుంచి ఒక దారుణమైన వార్తను వినాల్సి వచ్చింది. ఈ సినిమా ఫైట్ షూట్ ప్రాక్టీస్ లో భాగంగా స్టంట్ మ్యాన్ అయిన ఏజుమలై 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు.

దాంతో ఆయన ఛాతి భాగంలో విపరీతమైన గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అవ్వడంతో హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు…ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. దానికి కారణం ఈ మధ్య కాలం లో చాలామంది ఇలాగే చనిపోతున్నారు. నిజానికి శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ సమయం లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక సెట్ లో జరిగిన ప్రమాదం వల్ల ఐదారుగురు చనిపోయారు. మిగతా కొంతమందికి గాయాలయ్యాయి.

ఇక ఇది చూసిన చాలా మంది తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మేకర్స్ జాగ్రత్తలు వహిస్తూ సినిమా షూట్ చేస్తే బాగుంటుందంటూ చాలా రోజుల నుంచి చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సీన్స్ నాచురల్ గా రావాలనే ఉద్దేశంతోనే అలా రియలేస్టిక్ గా చేస్తూ ఉంటారు. ఇక దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ మరి కొంతమంది కూడా దీనిమీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే అన్యాయంగా కొంతమంది ప్రాణాలు తీయడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికైనా సినిమాలను తెరకెక్కించే ప్రతి సినిమా యూనిట్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం సలహాలు ఇస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా ఈ సంవత్సరం సినిమాలను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కమల్ హాసన్ లాంటి హీరో ‘భారతీయుడు 2’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇక ఈయన తర్వాత విక్రమ్, సూర్య లాంటి స్టార్ హీరోలు కూడా వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు…