Kantara 2 US Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాల్లో ఒకటి ‘కాంతారా 2′(Kantara: The Chapter 1). మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అవ్వడం తో రెండవ భాగంపై సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అలా ఈ సినిమాపై షూటింగ్ ప్రారంభ దశ నుండే అంచనాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యాక ఆ అంచనాలు మరింత పెరిగాయి. అలా భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ వేశారు. ఈ షోస్ ని చూసిన ఆడియన్స్ పూనకాలొచ్చి ఊగిపోతూ ట్వీట్లు వేశారు. ఈమధ్య కాలం లో ఒక పాన్ ఇండియన్ చిత్రానికి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం ఎప్పుడూ జరగలేదు. అయితే ఆ టాక్ ఈ చిత్రానికి డొమెస్టిక్ మార్కెట్ లో మంచి వసూళ్ళను రాబట్టేలా చేస్తున్నప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం దారుణమైన వసూళ్లను నమోదు చేసుకుంటున్నాయి.
ముఖ్యంగా నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. 9 మిలియన్ డాలర్లు పెట్టి ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశారు. కానీ 5 రోజుల్లో వచ్చిన వసూళ్లు కేవలం 2.7 మిలియన్ డాలర్స్ మాత్రమే. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండి 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘కాంతారా 2 ‘ ఇప్పటికీ ఈ వాసూళ్లను అందుకోలేదు. ట్రెండ్ ని చూస్తుంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో కనీసం ఓజీ ప్రీమియర్స్ + మొదటి రోజు వసూళ్లను కూడా దాటడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 9 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఒక సినిమాకు, పాజిటివ్ టాక్ మీద ఇంత దారుణమైన వసూళ్లు రావడం హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు.
పాజిటివ్ టాక్ వస్తేనే ఇలా ఉందంటే, పొరపాటున ఫ్లాప్ టాక్ వచ్చి ఉండుంటే ఎలా ఉండేదో?, డిజాస్టర్ కా బాప్ అయ్యేదేమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. డొమెస్టిక్ మార్కెట్, అనగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. కేవలం కర్ణాటక లో మాత్రమే ఈ చిత్రం వేరే లెవెల్ పెర్ఫార్మన్స్ ని ఇస్తుంది. నేడు కూడా ఆ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ సెలవు దినాన్ని తలపిస్తుంది. కచ్చితంగా ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ తెలుగు లో మాత్రం డిజాస్టర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ.