Vijay Devarakonda road accident: ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కారు నిన్న గద్వాల్ సమీపం లో యాక్సిడెంట్ కు గురవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ కారు కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ కి కానీ, అతని కుటుంబానికి కానీ ఎలాంటి గాయాలు అవ్వలేదు కానీ, కారు ముందు భాగం మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. తప్పు ఎవరిదీ అనేది కాసేపు పక్కన పెడితే, విజయ్ దేవరకొండ కారు నెంబర్ కనిపించడం తో, సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ఈయన కారు పై చలాన్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించారు. చూస్తే ఆయన కారు పై చలాన్ ఉన్నది. ఈ కారులో ఆయన ఆదివారం రోజున పుట్టపర్తికి వెళ్తుండగా ఓవర్ స్పీడ్ ఫైన్ పడింది. గద్వాల్ జిల్లా ఉండవల్లి వద్ద స్పీడ్ లిమిట్ దాటి మరీ 114 కిలోమీటర్ల వేగం తో వెళ్తున్నప్పుడు స్పీడ్ గన్ ఫోటో తీసింది.
తెలంగాణ e చలాన్ పోర్టల్ లో విజయ్ దేవరకొండ కారు నెంబర్ తో వెతికితే, ఆయన పై 1035 ఫైన్ పడినట్టు, దానిని ఆయన చెల్లించినట్టుగా కూడా చూపించింది. ఇప్పుడు ఆయన పేరు పై ఎలాంటి చలాన్స్ లేవు. చూస్తుంటే విజయ్ దేవరకొండ డ్రైవింగ్ చాలా వేగంగా చేస్తాడని అర్థం అవుతుంది. 114 కిలోమీటర్ల వేగంతో హై వే మీద వెళ్లడం సహజం. కానీ స్పీడ్ లిమిట్స్ ఉన్న చోట కూడా ఆయన ఇంత వేగంగా వెళ్లడం అసలు మంచిది కాదు. నిన్న జరిగిన యాక్సిడెంట్ విజయ్ దేవరకొండ కి ఒక చిన్న హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో తీరుని మార్చుకోకపోతే దారుణాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన అభిమానులు విజయ్ దేవరకొండ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో వేడుకుంటున్నారు.
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే, రీసెంట్ గానే కింగ్డమ్ చిత్రం తో ఆయన మరో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. గీత గోవిందం చిత్రం తర్వాత కెరీర్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు మరో భారీ ఫ్లాప్ తో తన కెరీర్ ని మరింత సమస్యగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘శ్యామ్ సింగరాయ్’ డైరెక్టర్ రాహుల్ తో ఒక పీరియడ్ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే రీసెంట్ గానే ఆయనకు ప్రముఖ హీరోయిన్ రష్మిక తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.