Pushpa 2 Vs Devara: పాన్ ఇండియాలో సౌత్ సినిమాల హవా బీభత్సంగా ఉందనే చెప్పాలి. మనవాళ్ళ దెబ్బకి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా వాళ్ళ హీరోల సినిమాలను పట్టించుకోవడం లేదు. ఎంతసేపు మన సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారే తప్ప, వాళ్ల సినిమాలను పట్టించుకునే నాధుడు లేడనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న సూర్య కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శివ డైరెక్షన్ లో ‘కంగువ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం వల్ల ఈ సినిమామైన విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేస్తుంది. అంటూ మంచి నమ్మకంతో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే విక్రమ్ హీరోగా ‘తంగలన్ ‘ అనే సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాకి పా రంజిత్ డైరెక్షన్ చేశాడు.
ఇంతకుముందు రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా రజనీకాంత్ తో ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ అయితే లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే విక్రమ్ తో చేస్తున్న తంగలన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇక కంగువ, తంగలన్ ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ రెండు తమిళ సినిమాలే కావడంవల్ల ఈ రెండింటిలో ఏది ఎక్కువ వసూళ్లను రాబడుతుంది అనే విధంగా ఇప్పటికే ఆయా హీరోల అభిమానుల మధ్య విపరీతమైన పోటీ అయితే నెలకొంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో వరుస విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళుతున్న హీరో అల్లు అర్జున్…పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో ఒక్కసారిగా తన మ్యాజిక్ ని క్రియేట్ చేశాడు.
ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి దాన్ని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైన వసూళ్లను రాబడుతుందనే ఆలోచనలో సినిమా మేకర్స్ ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద కూడా ప్రేక్షకులు మంచి అంచనాలను పెట్టుకున్నారు. ఇక ముఖ్యంగా పుష్ప 2 కి, దేవర సినిమాకి మీద భారీ ఫైట్ అయితే నడుస్తుంది. మరి వీళ్లలో ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లను సాధిస్తుంది. ఏ హీరో బాక్సాఫీస్ కింగ్ గా మిగులుతాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కంగువ వర్సెస్ తంగలన్ సినిమా పోటీ లో కంగువ విజయం సాధిస్తుందని తెలుస్తుంది. ఇక పుష్ప 2 వర్సెస్ దేవర పోటీ లో పుష్ప 2 విజయం సాధిస్తుంది. ఇక ఈ నాలుగు సినిమాల్లో కూడా పుష్ప 2 నే భారీ వసూళ్లను రాబడుతోందనేది మాత్రం చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఈ నాలుగు సినిమాల్లో పుష్ప 2 మూవీ కే ఎక్కువ హైప్ ఉంది…