Kalki 2898 AD Collections: కల్కి మూవీ 10 డేస్ కలెక్షన్స్: బయ్యర్లకు లాభాలు షురూ, ప్రభాస్ మూవీ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

కల్కి మూవీ 10వ రోజు వసూళ్లు గమనిస్తే... తెలుగు రాష్ట్రాలైన ఏపీ/ తెలంగాణాలలో కల్కి పదో రోజు రూ. 6 కోట్ల షేర్ రాబట్టింది. హిందీ, యూఎస్, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 20 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

Written By: S Reddy, Updated On : July 7, 2024 1:14 pm

Kalki 2898 AD Collections

Follow us on

Kalki 2898 AD Collections: ప్రభాస్ కల్కి 2829 AD మూవీతో క్లీన్ హిట్ కొట్టాడు. కల్కి లాభాల్లోకి ఎంటర్ అయ్యింది. కల్కి చిత్ర వసూళ్లు వెయ్యి కోట్లు దిశగా పరుగులు పెడుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఫస్ట్ షో నుండే కల్కి చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో భారీ ఓపెనింగ్స్ దక్కాయి. లాంగ్ వీకెండ్ ని కల్కి చక్కగా ఉపయోగించుకుంది. కల్కి చిత్రానికి ఎలాంటి పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా మేజర్ రిలీజెస్ లేవు. రెండో వారం కూడా ప్రభాస్ కల్కి చిత్రంతో వసూళ్లు దున్నేశాడు.

కల్కి మూవీ 10వ రోజు వసూళ్లు గమనిస్తే… తెలుగు రాష్ట్రాలైన ఏపీ/ తెలంగాణాలలో కల్కి పదో రోజు రూ. 6 కోట్ల షేర్ రాబట్టింది. హిందీ, యూఎస్, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 20 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. వరల్డ్ వైడ్ కల్కి 10 రోజులకు రూ. 390 కోట్ల షేర్, రూ. 850 కోట్ల గ్రాస్ రాబట్టింది. కల్కి బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి ఎంటర్ అయ్యింది.

కల్కి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు పరిశీలిస్తే… నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్ రూ. 27 కోట్లు, ఆంధ్ర రూ. 76 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కల్కి హక్కులు రూ. 168 కోట్లకు అమ్ముడుపోయాయి. కర్ణాటక రూ.25 కోట్లు, తమిళనాడు రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా+హిందీ రూ. 85 కోట్లకు అమ్మారు. ఓవర్సీస్ హక్కులు రూ. 70 కోట్లకు అమ్మడుపోయాయి. వరల్డ్ వైడ్ కల్కి రూ. 370 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

రూ. 371 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో కల్కి బరిలో దిగింది. రూ. 390 కోట్ల షేర్ రాబట్టిన నేపథ్యంలో రూ. 19 కోట్ల లాభాలు పంచింది. నేడు ఆదివారం కల్కి వసూళ్లు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. అయితే కల్కి తమిళనాడు, కేరళలో ప్లాప్ అని చెప్పాలి. ఆ రెండు రాష్ట్రాల్లో కల్కి మూవీకి పెద్దగా ఆదరణ దక్కలేదు. యూఎస్లో అన్ని ఏరియాలకు మించిన రెస్పాన్స్ వచ్చింది. కల్కి నార్త్ ఇండియా వసూళ్లు $ 15.3 మిలియన్ వసూళ్లు దాటేశాయి. కల్కి మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు చేశారు. నాగ్ అశ్విన్ దర్శకుడు.