https://oktelugu.com/

Kalki 2898 AD : కల్కి మూవీలో దీపిక పదుకొనే క్యారెక్టర్ ను మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..?

Kalki 2898 AD ఇక ఈ సినిమా లో కమలహాసన్ క్యారెక్టర్ నిడివి చాలా తక్కువ గా ఉంది.అయినప్పటికీ 'కల్కి 2' లో ఆయన పాత్రే చాలా కీలకంగా మారబోతుందనేది కల్కి సినిమా చివర్లో చాలా క్లియర్ గా చూపించారు...

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2024 / 01:09 PM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD : ఒక సినిమాలో ఒక పాత్ర చేయడం కోసం మొదట ఒక నటుడిని అనుకొని ఆ తర్వాత మరొకరితో ఆ పాత్ర చేయించి సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి కోవకి చెందిందే కల్కి సినిమా… ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్ కోసం మొదట వేరే నటిని తీసుకోవాలని అనుకున్నారట..మరి ఆ నటి ఎవరు అని మనం ఒకసారి మనం తెలుసుకుందాం…

    ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎక్కడ చూసిన కల్కి సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. ఇప్పటి వరకు దాదాపు 800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తొందరలోనే వెయ్యి కోట్ల మార్కు టచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కమలహాసన్, ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ యాక్టర్స్ నటించడం విశేషం… ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండడంతో ఈ సినిమాలో నటించే ప్రతి యాక్టర్ కి మంచి గుర్తింపు అయితే లభించింది. ఇక అందులో భాగంగా ‘దీపిక పదుకొనే’ చేసిన క్యారెక్టర్ గురించి మనం సపరేట్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె నటించింది చాలా తక్కువ సీన్లలో అయినప్పటికీ గుర్తుండిపోయే యాక్టింగ్ తో ప్రేక్షకులందరిని మైమరిపింపజేసింది.

    అలాగే తను ఈ సినిమాలో ఉండటం వల్ల బాలీవుడ్ మార్కెట్ పరంగా కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కల్కి మూవీ మేకర్స్ ముందుగా దీపికా పదుకొనే కి బదులు ఆ క్యారెక్టర్ లో ‘పూజా హెగ్డే’ ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ పూజా హెగ్డే ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక దానికి తోడుగా పూజ యాక్టింగ్ మీద మొదటి నుంచి కూడా చాలా విమర్శలైతే వస్తున్నాయి.

    దానివల్ల ఈ సినిమాలో ఆమెను తీసుకుంటే మూవీ కి మైనస్ అవుతుందనే ఉద్దేశ్యం తోనే మేకర్స్ దీపిక పదుకొనే ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి…ఇక ఈ సినిమా లో కమలహాసన్ క్యారెక్టర్ నిడివి చాలా తక్కువ గా ఉంది.అయినప్పటికీ ‘కల్కి 2’ లో ఆయన పాత్రే చాలా కీలకంగా మారబోతుందనేది కల్కి సినిమా చివర్లో చాలా క్లియర్ గా చూపించారు…