Pawan Kalyan OG
Pawan Kalyan OG: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన సినిమాలు రీ రిలీజ్ చేసిన కూడా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం గా రాజకీయ రంగంలో రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు.
అలాగే ఆయన కమిటైన కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేసి అవి సెట్స్ మీద ఉన్నాయి. కాబట్టి ఇక ఆ సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజకీయంగా తను కొత్తగా తీసుకున్న పదవి బాధ్యతలకు న్యాయం చేయాలి. కాబట్టి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలను నిర్వహించి ఆ తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే సుజీత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ సినిమాకి సంబంధించి ఇందులో చాలా సీన్లు చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సీన్స్ ని కూడా ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా ఎస్టాబ్లిష్ చేశారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫైట్ సీక్వెన్సులు కూడా ఉన్నాయట. ఇక పవన్ కళ్యాణ్ రాగానే సుజీత్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ ని ఒకదానిని డిజైన్ చేశారట. ఇక ఆ ఫైట్ మాస్టర్ చేస్తున్న దాంట్లో కొంచెం మిస్టేక్ ఉంటే పవన్ కళ్యాణ్ దాన్ని సవరించి తనే ఫైట్స్ మొత్తాన్ని షూట్ చేశారట.
ఇక దానికి సెట్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారట. ఇక ఆయన నేర్చుకొని చాలా సంవత్సరాలు అయినప్పటికి పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన సెట్ లోకి వెళ్ళగానే అ ఫైట్ ని చాలా క్లియర్ కట్ గా చేసి ఆ మొత్తం బాధ్యతని తనే తీసుకొని ముందు ఉండి నడిపించారట. ఇక మొత్తానికైతే ఒక భారీ ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ గారే కంపోజ్ చెస్సినట్టుగా సుజీత్ ఒక ఇంటర్వ్యూ తెలియజేశాడు…