Allu Aravind: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా మారాడు. అటు స్టేట్ లో టిడిపి పార్టీ అధికారంలోకి రావడానికి, ఇటు సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో నిలవడానికి తను కీలకపాత్ర వహించాడని స్వయంగా మోడీ గారే చెప్పడం విశేషం…
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రాజకీయ రంగాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఎలాగైతే అధికారంలోకి వస్తామో అలాంటి పావులు కదుపుతూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే ఎన్డీఏ కూటమితో వెళితేనే తాము గెలువగలరు అధికార పార్టీలో ఉన్న జగన్ ను గద్దె దించొచ్చు అనే ఉద్దేశంతోనే తను కూటమిని ఏర్పాటు చేసి ముందుకు కదిలాడు. ఇక ఫలితం చాలా గ్రాండ్ లెవెల్లో కనిపించింది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నిర్మాతల మండలి ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఇక అందులో ముఖ్యంగా అల్లు అరవింద్ మాత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడాడు.
ఇక ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసే విధంగా తమకు అపాయింట్ మెంట్ ఇప్పించమని కోరమని దానికి కళ్యాణ్ గారు కూడా ఒకే అన్నారని చెప్పాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సన్మానించుకోవాలనే ఉద్దేశ్యం తో సినిమా యూనిట్ అంతా ఉందని తొందర్లోనే సన్మానించుకుంటామంటూ ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చీప్ గా చూసిన అల్లు అరవింద్ ఆయన పాలిటీక్స్ లో ఏం గెలుస్తాడు చక్కగా సినిమాలు చేసుకోవచ్చు కదా అని వాళ్ల సన్నిహితుల దగ్గర చాలా సార్లు అన్నాడట.
కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మావాడు అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తూన్నాడు. ఆయన విజయానికి వీళ్ళు ఏ రకంగాను ఉపయోగపడలేదు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎవ్వరిని దూరం పెట్టకుండా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని తన వాళ్లు అనుకొని స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.