Jabardasth TRP Rating: ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి వారం గురువారం శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపొయ్యి చూస్తారు..ఈ కామెడీ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ వచ్చి మంచి డిమాండ్ ఉన్న నటులుగా కొనసాగుతున్నారు..అంతమందికి జీవితం ని అందించిన ఈ షో ఇప్పుడు తీవ్రమైన కష్టాల్లో పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈటీవీ కి ఇప్పటికి కూడా మంచి TRP రేటింగ్స్ తో టాప్ చానెల్స్ తో పోటీపడడానికి ప్రధాన కారణాలలో ఒకటి జబర్దస్త్ షో..అలాంటి షోకి ఇప్పుడు పాపులారిటీ తగ్గిపోతూ వస్తుంది..మొదట్లో ఈ షో కి 6 కి తక్కువ కాకుండా TRP రేటింగ్స్ వచ్చేవి..గడిచిన పదేళ్లలో ఈ షో ఇదే స్థాయి TRP రేటింగ్స్ ని దక్కించుకుంటూ వచ్చింది..కానీ ఈ ఏడాది ఈ షో TRP రేటింగ్స్ అతి దారుణంగా పడిపొయ్యాయట..ప్రస్తుతం అయితే గత కొద్ది వారాల నుండి కనీసం 2 TRP రేటింగ్స్ కూడా ఈ షో దక్కించుకోలేకపోతుందట..ఈ షో కి ప్రస్తుతం ఆయువుపట్టు లాగ ఉంటూ వస్తున్న సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది వంటి వారు మానేయడం వల్లే TRP రేటింగ్స్ ఈ స్థాయిలో డౌన్ అయ్యాయి అని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.

Also Read: Kamal Haasan: చాలా రోజుల తర్వాత కడుపునిండా అన్నం తింటున్నాను – కమల్ హాసన్
తొలుత ఈ షో లో మొదటి నుండి జడ్జి గా ఉంటూ వస్తున్న నాగబాబు మానేయడం దగ్గర నుండి పతనం ప్రారంభం అయ్యింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు..మల్లెమాల ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో ఏర్పడిన కొన్ని విభేదాల కారంగానే ఆయన ఈ షో నుండి తప్పుకున్నారు..కానీ సుడిగాలి సుధీర్ మరియు హైపర్ వంటి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్స్ ఈ షో లో కొనసాగుతూ ఉండడం వల్ల TRP రేటింగ్స్ మాత్రం దారుణంగా అయితే అప్పట్లో పడిపోలేదు..కానీ ఇటీవల ఈ ఇద్దరు కూడా షో మానేశారు..వీళ్ళు డిమాండ్ చేసినంత పారితోషికం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఇవ్వకపోవడం వల్లే వీళ్ళు ఈ షో ని విడిచినట్టు సోషల్ మీడియా లో వినిపిస్తున్న మాట..మరోపక్క జడ్జి రోజా కూడా తనకి మంత్రి పదవి రావడం తో ఈ షో నుండి తప్పుకున్నారు..ఇప్పుడు ఉన్న కమెడియన్స్ చేస్తున్న స్కిట్స్ ఏ మాత్రం కూడా జనాలను ఆకట్టుకోలేకపోవడం వల్లే ఈ స్థాయిలో TRP రేటింగ్స్ పడిపోయాయి అని తెలుస్తుంది..పరిస్థితి ఇలాగే మరో రెండు వారాలు కొనసాగితే ఈ షో ఆగిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్..మరి ఈ షో అధినేత ఒక్క మెట్టు దిగి హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్ ని మళ్ళీ షో లోకి తీసుకొస్తారా..లేదా ఇలాగే కొనసాగుతారా అనేది చూడాలి.
Also Read: RRR Closing Collection: ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..!