Pawan Kalyan: అసెంబ్లీ ఒకే మరి సినిమాల సంగతి ఏంటంటున్న పవన్ అభిమానులు.. క్లారిటీ వచ్చేసిందిగా

పవన్‌ను అసెంబ్లీలో చూడాలని చాలా మంది అభిమానులు కలలు కన్నారు. ఇది త్వరలో నెరవేరబోతోంది. ప్రస్తుతం సినిమాల విషయంలోనే కూడా క్లారిటీ కావాలంటున్నారు ఫ్యాన్స్‌.

Written By: Swathi, Updated On : June 15, 2024 1:43 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఎంతో మంది ఎదురుచూస్తున్న తరుణంలోనే ఆయన ఎన్నికల బిజీతో హాజరుకాలేక పోయారు. ఇక రీసెంట్ ఎన్నికలు జరగడం, రిజల్ట్ రావడం జరగడంతో పవన్ అభిమానులు ఆయన సినిమా అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్నారు. ఈయన చేతి లో ఉన్న 4 సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలే. దీంతో ఆ నాలుగు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో పవన్‌ ఓ నిర్ణయం తీసుకున్నారన్నారు అని టాక్.

పవన్‌ను అసెంబ్లీలో చూడాలని చాలా మంది అభిమానులు కలలు కన్నారు. ఇది త్వరలో నెరవేరబోతోంది. ప్రస్తుతం సినిమాల విషయంలోనే కూడా క్లారిటీ కావాలంటున్నారు ఫ్యాన్స్‌. హరి హర వీరమల్లు సినిమా ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఓజీ, ఉస్తాద్ భగత్‌ సింగ్ సినిమాలు స్టార్ట్ చేసి కూడా చాలా కాలం అవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కానీ పొలిటికల్ బిజీ కారణంగా ఈ సినిమాలకు బ్రేక్ వేశారు పవర్ స్టార్‌.

ఇప్పుడు ఎన్నికల హడావిడి ముగియటంతో సినిమాల మీద ఫోకస్ చేయబోతున్నారని టాక్. ఈ మొత్తం సినిమాల కోసం ఓ ఆరు నెలల పాటు సమయం కేటాయించేలా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారట. ఈ టైమ్‌లో ఆల్రెడీ కమిట్‌ అయిన సినిమాలకు సంబంధించి, తన వర్క్ మొత్తం ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేయమని మేకర్స్‌కు క్లారిటీ ఇచ్చేశారట పవన్ కళ్యాణ్. హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్ దాదాపు ఫైనల్ లోనే ఉంది కాబట్టి ఆ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణియించుకున్నారట.

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాను కూడా వెంటనే స్టార్ట్ చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారట. వన్స్ సినిమాలకు సంబంధించిన పనులు పూర్తైతే మొత్తం సమయం రాజకీయాలకు కేటాయించవచ్చని భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ సినిమాలు వరుసగా వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా తెగ ఫీలై పోతున్నారు. అందుకే అభిమానుల నిరీక్షణకు త్వరలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టేయాలని, త్వరగా సినిమాలు ముగించాలనే ఆలోచనలో ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.