https://oktelugu.com/

Home Loan : బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఈఎంఐ భారం ఉండదు..

Home Loan అందువల్ల ఏ బ్యాంకు రెపో రేటు తగ్గిందో తెలుసుకున్న తర్వాత ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం వల్ల భారం తగ్గుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 15, 2024 / 01:32 PM IST
    Follow us on

    home loan  : నేటి కాలంలో సొంతిల్లు కోసం కష్టపడని వారు లేరు. ఎన్ని సమస్యలు ఉన్నా సొంత ఇంట్లో ఉన్న ఆ హాయే వేరుగా ఉంటుంది. అందుకే జీవితంలోని లక్ష్యాలలో సొంతిల్లును చేర్చుకుంటారు. కొందరు జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఇల్లు నిర్మించుకుంటారు. అయితే అందరికీ ఇల్లు కట్టుకునే బడ్జెట్ అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో బ్యాంకు ద్వారా హోమ్ లోన్ తీసుకొని తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటారు. అయితే బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బాగానే ఉన్నా.. నెల నెల ఈఎంఐ కట్టే సమయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈఎంఐ భారం పడకుండా ఉండడానికి కొన్ని టిప్స్ పాటించాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆ టిప్స్ ఏవో తెలుసా?

    ఇల్లు నిర్మించాలనుకునేవారు కొందరు ఇల్లుకు సరిపోయే మొత్తం లోన్ తీసుకోవాలని అనుకుంటారు. మరి కొందరు 50 శాతం వరకు తీసుకుంటారు. రుణం ఎలా తీసుకున్నా.. దానిని ఎక్కువ కాలం ఎవరి పెట్టుకోవడం వల్ల అధిక వడ్డీ పడుతుంది. దీంతో నెలనెలా ఈఎంఐ కట్టలేక అవస్థలకు గురవుతారు. ఇలాంటి సమయంలో టెన్యూర్ను తగ్గించుకోవడం వల్ల సమస్య తీరుతుంది. ఉదాహరణకు 50 లక్షల రుణం తీసుకుంటే దీనికి పది సంవత్సరాల పాటు 26 లక్షల రూపాయల అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఐదు సంవత్సరాలకు 18 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల రుణకాల పరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఎక్కువ సంవత్సరాలు ఈఎంఐ భారం ఉండదు.

    కొందరు తక్కువ ఈఎంఐ ఉండడం వలన సులభంగా లోన్ తీరుస్తామని భావిస్తారు. కానీ ఈఎంఐ ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా లోన్ తీరుతుంది. అంతేకాకుండా అధిక వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం ఈఎంఐని ప్రతినెల ఐదు శాతం పెంచుకుంటూ పోవడం వల్ల 20 సంవత్సరాల వరకు ఉన్న లోన్ 8 సంవత్సరాలలోపే పూర్తవుతుంది. అదే 10 శాతం పెంచుకుంటూ పోతే 10 సంవత్సరాలలో ముగుస్తుంది. దీంతో రుణం ఎక్కువగా అనిపించదు. అయితే మీకు వచ్చే ఆదాయంలో 8 నుంచి 10 శాతం పెంచుకుంటే ఎలాంటి అదనపు భారం ఉండదు.

    బ్యాంకు నుంచి లోన్ తీసుకునే సమయంలో దీనిపై బీమా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రుణ రుణాన్ని చెల్లించే వ్యక్తి అన్ని సమయాల్లో ఒకేలా ఉంటాడని చెప్పలేం. అందువల్ల ఏదైనా సంఘటన జరిగిన సమయంలో ఈ బీమా చాలావరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం వల్ల ఈ రుణభారం కుటుంబ సభ్యులపై పడకుండా ఉంటుంది.

    లోన్ తీసుకునేటప్పుడు ప్రస్తుత ఫ్రీక్వెన్సీ ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. బెంజ్ మార్కెట్లో రేపో వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవి బ్యాంకుల మధ్య తేడాగా ఉంటాయి. అందువల్ల ఏ బ్యాంకు రెపో రేటు తగ్గిందో తెలుసుకున్న తర్వాత ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం వల్ల భారం తగ్గుతుంది.