https://oktelugu.com/

Krishna: మహేష్ ని కాదని రూ. 1000 కోట్లు ఆస్తి అతడికి రాసిచ్చిన కృష్ణ..!

రెండవ భార్య విజయనిర్మల కుమారుడు నరేష్. కృష్ణకు నరేష్ స్టెప్ సన్ అవుతాడు. కృష్ణ సంపాదించిన రూ. 1000 కోట్లుకు పైగా విలువైన ఆస్తి నరేష్ కి దక్కినట్లుగా తెలుస్తుంది. నానక్ రామ్ గూడలో ఉన్న 12 ఎకరాల స్థలం నరేష్ పేరున ఉందని సందేహాలు కలుగుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : May 29, 2024 / 07:47 PM IST

    Krishna

    Follow us on

    Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. తేనెమనసులు సినిమాతో హీరో కృష్ణను బ్రేక్ వచ్చింది. సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. నటుడిగా,దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. పద్మాలయ స్టూడియోస్ నిర్మించారు. నిర్మాతగా వివిధ భాషల్లో 50కి పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.

    ఈ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. లక్షల్లో లాభాలు, అదే సమయంలో నష్టాలను చవిచూశారు. సంపాదించిన డబ్బు సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేవారు. ఆయన సినీ కెరీర్ లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఒక స్టార్ హీరోగా ఆయన భారీగానే సంపాదించారు. అయితే కృష్ణ ఆస్తులు ఎవరికి చెందాయి అనే సందేహం చాలా కాలంగా ఉంది. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. కృష్ణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఇందిరాదేవికి రమేష్ బాబు, మహేష్ ఇద్దరు కుమారులు.

    రెండవ భార్య విజయనిర్మల కుమారుడు నరేష్. కృష్ణకు నరేష్ స్టెప్ సన్ అవుతాడు. కృష్ణ సంపాదించిన రూ. 1000 కోట్లుకు పైగా విలువైన ఆస్తి నరేష్ కి దక్కినట్లుగా తెలుస్తుంది. నానక్ రామ్ గూడలో ఉన్న 12 ఎకరాల స్థలం నరేష్ పేరున ఉందని సందేహాలు కలుగుతున్నాయి. నానక్ రామ్ గూడాలో కృష్ణ – విజయనిర్మల 12 ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పట్లో ఎకరం ఖరీదు రూ. 1.3 లక్షలు. ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరం రూ. 100 కోట్లు. అంటే 12 ఎకరాల ధర రూ. 1000 కోట్లకు తగ్గదు.

    కాగా ఈ స్థలాన్ని కొన్న తర్వాత కృష్ణ – విజయనిర్మల ఇక్కడకు వచ్చేసారు. నరేష్ మొదటి నుండి కృష్ణ – విజయ నిర్మలతో కలిసి ఉండేవారు. అయితే నానక్ రామ్ గూడలో ఉన్న 12 ఎకరాలు నరేష్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణ మిగిన ఆస్తులు రమేష్ బాబు, మహేష్ లకు ఇచ్చారని సమాచారం. కృష్ణ-విజయనిర్మలకు చెందిన విలువైన ఉమ్మడి ఆస్తి నరేష్ వశం చేసుకున్నాడు. నా ఆస్తి వెయ్యి కోట్లు అని నరేష్ పలుమార్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే…