Sarkaar Season 4: సుడిగాలి సుధీర్ కి తెల్లార్లు అదే పని… మేటర్ లీక్ చేసి పరువు తీసిన జబర్దస్త్ ఇమ్మానియేల్!

నెక్స్ట్ గోట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అదే సమయంలో యాంకరింగ్ పై దృష్టి పెట్టాడు. సర్కార్ సీజన్ 4తో పాటు ఇటీవల ఫ్యామిలీ స్టార్ పేరుతో మరో షో స్టార్ట్ చేశాడు. హీరోగా యాంకర్ గా ఏక కాలంలో రాణించాలి అనుకుంటున్నాడు.

Written By: S Reddy, Updated On : May 29, 2024 7:52 pm

Sarkaar Season 4

Follow us on

Sarkaar Season 4: సుడిగాలి సుధీర్ యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటిటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న సర్కార్ సీజన్ 4 హోస్ట్ చేస్తున్నాడు. కాగా ఈ షోకి మంచి ఆదరణ దక్కుతుంది. ఇటీవల కాలంలో అత్యధిక వ్యూస్ సాధించిన షోగా సర్కార్ 4 నిలిచింది. కాగా సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్ కి ‘ గం గం గణేశా ‘ మూవీ టీం గెస్టులుగా హాజరయ్యారు. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ ప్రగతి, ఇమ్మాన్యుయేల్, ప్రిన్స్ యావర్ లు వచ్చారు. అయితే ముందుగా సుధీర్ ఆనంద్ దేవరకొండతో .. మీ రియల్ లైఫ్ లో కూడా బేబీ ఉందా అని అడిగాడు. నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా బేబీ లేదు అని ఆనంద్ దేవరకొండ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.

ఇక తర్వాత ప్రగతి తో సుధీర్ పులిహోర కలిపాడు. ‘ఒక్కసారి అంటే బావ… పిచ్చి కుక్కలు కరిసినా సావా’ అంటూ డైలాగులు చెప్పాడు. ఇక ఆ తర్వాత ఇమ్మానుయేల్ సుధీర్ మధ్య ఫన్ హిలేరియస్ గా ఉంది. సుధీర్ పై పంచులు వేస్తూ ఇమ్మాన్యుయేల్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ప్రిన్స్ యావర్ ని సుడిగాలి సుధీర్… ఏంటి నీ బాడీ ఇంత ఫిట్ గా ఉంది అని అడిగాడు. నేను ప్రతి రోజు వర్కౌట్ చేస్తాను అని యావర్ చెప్పాడు.

అంతలో ఇమ్మాన్యుయేల్ అందుకుని ‘ అతను ఉదయం వర్కౌట్ చేస్తాడు. నువ్వేమో ఉదయం అయ్యేదాకా చేస్తావు అని సుధీర్ పరువు తీసేశాడు. అంతేకాదు సుధీర్ పెద్ద కాట్రాజు అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ మే 31న ఆహాలో స్ట్రీమ్ కానుంది. బుల్లితెర స్టార్ గా సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ గా నుండి హీరో స్థాయికి ఎదిగాడు. వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, పండుగాడు, త్రీ మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర వంటి చిత్రాలు చేశారు.

నెక్స్ట్ గోట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అదే సమయంలో యాంకరింగ్ పై దృష్టి పెట్టాడు. సర్కార్ సీజన్ 4తో పాటు ఇటీవల ఫ్యామిలీ స్టార్ పేరుతో మరో షో స్టార్ట్ చేశాడు. హీరోగా యాంకర్ గా ఏక కాలంలో రాణించాలి అనుకుంటున్నాడు.