Pawan Kalyan And Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఒకే ఒక్కరు ‘మెగాస్టార్ చిరంజీవి’… ఆయనను మించిన నటుడు ఈ జనరేషన్ లో ఎవ్వరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన సాధించిన విజయాలు ఆయన అందుకున్న ఘనతలు అలాంటివి. అలాంటి చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించడానికి ప్రతి ఒక్కరు ఎదురు చూసేవారు. అలాంటి అవకాశం వస్తే చాలు అదొక అదృష్టం అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి లాంటి స్టార్ హీరోతో చాలామంది హీరోయిన్లు నటించి మెప్పించారు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయనకు ఫ్యాన్స్ కంటే కూడా భక్తులు ఎక్కువగా ఉంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా ముందుకు సాగుతున్నాడు. అయినప్పటికీ ఆయన సినిమాలను మాత్రం ఎక్కడ వదలకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ రెండు నెలల్లో సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగుల్లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ ఒక భారీ హిట్ కొట్టబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలో నిలబడి ఫోటో దిగిన ఆ అమ్మాయి ఎవరు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. నిజానికి ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో వెలుగొందిన నటి కావడం విశేషం. అయితే ఆమె ఎవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రోజా… గత వైసిపి పాలనలో పదవి బాధ్యతలను కొనసాగించిన ఆమె ఒకప్పుడు చిరంజీవి పక్కన చాలా సినిమాల్లో నటించి వాళ్ళిద్దరిది హిట్ పెయిర్ గా గుర్తింపు పొందారు. అలాంటి రోజా ఆ తర్వాత కాలంలో రాజకీయ ఎంట్రీ ఇవ్వడం,ఆ పైన వైసిపి పార్టీలో కీలకమైన మెంబర్ గా కొనసాగుతూనే మంత్రి గా భాద్యతలను కూడా చేపట్టారు.
ఇక ఆమె మంత్రి అయినప్పటికీ ఆవిడ ఆ హోద లో ఉండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తూ చేసిన కామెంట్లు మాత్రం మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులను కూడా చాలావరకు కోపానికి గురిచేశాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో రోజా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇక ఈ ఫోటో చూసి చాలా మంది రోజా మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం నిజాయితీ గల మనిషి అయిన పవన్ కళ్యాణ్ ని రోజా అలా దూషించడం కరెక్ట్ కాదు అంటూ ఆమె మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటు మరోసారి రోజా మీద నెగిటివ్ కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే మరి కొంత మంది మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ రాజకీయం గా వైసీపీ పార్టీ కి తగిన బుద్ధి చెప్పారు అని కామెంట్లు చేస్తున్నారు…ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఈ ఫోటోను వైరల్ చేస్తూనే రోజా మీద వ్యతిరేకత ఎంతల ఉందో మరోసారి తెలియజేస్తున్నారు…